నకిలీ విత్తనాలతో రైతులకు తప్పని తిప్పలు

– ప్రతి సంవత్సరం ఇదే తంతు
అధికారులు విత్తన కంపెనీలతో కుమ్మక్క అయ్యారా ?
– బిజెపి రైతు నాయకులు వై వి సుబ్బారావు

గుంటూరుముచ్చట్లు:

ఖరీఫ్ ప్రారంభం కావడంతో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నకిలీ పత్తి విత్తనాలు, మిరప విత్తనాలు దందా జోరుగా కొనసాగుతుందని, ప్రతి సంవత్సరం ప్రారంభంలోనే ఈ నకిలీ విత్తనాలను అరికట్టడంలో వ్యవసాయశాఖ విఫలం కావడం, రైతుకు సరైననాణ్యతగల విత్తనం దొరకకపివడం, దొరికినా అవి నకిలీలు కావడంతో రుతు నష్టపోవడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం వ్యవసాయ శాఖ ఈ సీజన్లో ముందు నకిలీ విత్తనాలు పట్టుకోవడం, కేసులు పెట్టడం పరిపాటిగానే ఉందని బిజెపి రాష్ట్ర నాయకులు వై వి సుబ్బారావు ఎద్దేవా చేశారు. ప్రతి సంవత్సరం కూడా రైతులకు ఈ నకిలీ విత్తనాలతో పాటు నాణ్యత లోపించిన పురుగుమందులు తెగుళ్లు మందులు గడ్డి ముందు లతో తిప్పలు తప్పడం లేదని సుబ్బారావు ఆవేదన చెందారు. అధికారులు కు సరైన ప్రణాళిక లోపించిన కారణంగా నకిలీ కంపెనీలు రెచ్చిపోతున్నాయా,  లేక అధికారులు మాఫీయు నకిలీ కంపెనీలు ఇద్దరు కుమ్మక్కు అయ్యి రైతులను నట్టేట ముంచుతున్నారా అని అన్నారు. వ్యవసాయ శాఖకు ప్రతి గ్రామంలో ఆయా శాఖలకు సంబంధించిన క్షేత్రస్థాయిలో ఉద్యోగులు ఉన్నారని, ఇంతటి నెట్వర్కు ఉంచుకొని కూడా రైతులకు సరైననాణ్యమైన విత్తనాలు కానీ, రసాయనిక మందులు గానీ,  ఎరువులు  కానీ,  సరైన గిట్టుబాటు ధరలు గానీ అందించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం అని సుబ్బారావు ఆవేదన చెందారు.

ఈ వ్యవసాయ అధికారులు తలుచుకుంటే ఒక్క నకిలీ విత్తనం కూడా రైతుకు చేరే అవకాశం లేదని, ఇలా జరుగుతుంది అంటే అధికారుల వైఫల్యమే కారణం అన్నారు. అధికారులు ప్రతి సంవత్సరం జరిగే ఈ నకిలీ తంతును ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేదే పెద్ద సమస్యగా తయారయిందని, రైతులు కట్టే పన్నులతో వ్యవసాయ అధికారులు నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటూ రైతులకు సరైన సేవ చేయలేక పోతున్నారన్నారు. ఇలాంటప్పుడు రైతులకు  వ్యవసాయ శాఖ  అవసరం లేదని, వ్యవసాయాధికారులకు  ప్రభుత్వం ఇచ్చే జీతాలతో ప్రతి రైతుకు ఉచిత బీమా మరియు రైతులకు ప్రతి సంవత్సరం ఆర్థిక సహకారం అందించి రైతును ఉత్తమ రైతుగా చేయవచ్చన్నారు. ఏ విపత్తు వచ్చినా ముందుగా నష్టపోయేది ప్రప్రధమంగా రైతు అని తెలిపారు. ప్రకృతి సహకరించి పంటలు బాగా పండినా, గిట్టుబాటు ధర సరిగా లేక,  ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు సరిగా ఏర్పాటు చేయకపోవడం వల్ల ఒకవేళ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన కానీ, సరైన సౌకర్యాలు లేకపోవడంతో పంటను రైతులు సకాలంలో అమ్ముకోలేక నష్టపోతున్నారని సుబ్బారావు ఆవేదన చెందారు. ఇప్పటికైనా స్పందించి కళ్ళు తెరిచి ఈ నకిలీ విత్తనాలు మరియు నాణ్యత లోపించినవిత్తనాలు, రసాయనిక, తెగుళ్లు మందులు మరియు నకిలీ గడ్డి మందులను  పూర్తిగా అరికట్టాలని అధికారులకు బిజెపి రాష్ట్ర నాయకులు వై వి సుబ్బారావు విజ్ఞప్తి చేశారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

Tags:Wrong cats for farmers with fake seeds

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *