Natyam ad

ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ని పరామర్శించిన యస్.సి.వి నాయుడు .

చంద్రగిరి ముచ్చట్లు:

చంద్రగిరి నియోజకవర్గం టిడిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ని పరామర్శించిన యస్.సి.వి నాయుడు . వైసీపీ నాయకుల దాడిలో గాయపడి, విశ్రాంతి తీసుకుంటున్న చంద్రగిరి నియోజకవర్గం టిడిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ని, శ్రీకాళహస్తి నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు, ప్రస్తుత టిడిపి పార్టీ శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల ఇంచార్జ్  యస్. సి. వి నాయుడు  తిరుపతిలోని పులివర్తి నాని  నివాసంలో ఆయనను కలిసి పరామర్శించారు.అనంతరం పులివర్తి నాని  సతీమణి పులివర్తి సుధా రెడ్డి ని కలిసి దైర్యం చెప్పారు. యస్. సి. వి నాయుడు తో పాటు స్కిట్ కళాశాల మాజీ చైర్మన్ గురు దశరదన్, తాళ్లపాక దాము, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ చైర్మన్ కన్నయ్య నాయుడు, కొణతనేరి సర్పంచ్ బాలాజీ నాయుడు, ఆలత్తూరు ఎక్స్ సర్పంచ్ చెంచు రామా నాయుడు, తదితరులు పరామర్శించారు.

 

Post Midle

Tags: Y.C.V. Naidu visited MLA candidate Pulivarthi Nani.

Post Midle