Natyam ad

నగర కార్యదర్శిగా  యన్.వెంకటశివ తిరిగి ఎన్నిక

సహాయ కార్యదర్శులుగా కె సి బాదుల్లా,ఉద్దె మద్దిలేటి

కడప ముచ్చట్లు:

భారత కమ్యునిస్టు పార్టీ(సిపిఐ) కడప నగర 6వ మహాసభల్లో నగర కార్యదర్శిగా యన్. వెంకట శివ మూడవ సారి తిరిగి ఎన్నిక కాగా సహాయ కార్యదర్శులు గా కె సి బాదుల్లా,యు.మద్దిలేటి లతో పాటు71మంది తో నగర కౌన్సిల్ ను,39 మందితో కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.ఎన్నికైన నాయకత్వానికి పలువురు అభినందనలు తెలిపారు  రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు,జి ఈశ్వరయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగసు బ్బారెడ్డి,సి. సుబ్రహ్మణ్యంలు హాజరైన మహాసభలో సిపిఐ నూతన  నగర సమితిని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా ఎన్నికైన నూతన నాయకులు వెంకట శివ, బాదుల్ల,మద్దిలేటి లు మాట్లాడుతూ రానున్న కాలంలో నగరంలో  పార్టీ ప్రజా సంఘాల విస్తరణ ద్వారా సిపిఐ ని బలోపేతం చేస్తామన్నారు.కడప  నగరం మహానగరంగా అవతరించేందుకు తగు నగర సమగ్రాభివృద్ధి కోసం సిపిఐ ఉద్యమిస్తోందన్నారు. నగర మహాసభలో వివిధ అంశాలపై చర్చించి నిర్ణయించిన మేరకు భవిష్యత్ ప్రజా ఉద్యమాలను ఉదృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20, 21వ తేదీలలో ప్రొద్దుటూరులో జరిగే జిల్లా మహాసభలను విజయవంతం చేయాలన్నారు.

 

Post Midle

Tags: Y. Venkatasiva was re-elected as City Secretary

Post Midle

Leave A Reply

Your email address will not be published.