మార్చి 4 నుంచి యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి కొండపైన ఆలయ ఈవో గీతారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మార్చి 4వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు. 10వ తేదీన ఎదుర్కోలు, 11 వ తేదీన కల్యాణం, 12 వ తేదీన రథోత్సవం, ఈ బ్రహ్మోత్సవాల్లో నూతన బంగారు రథంలో శ్రీస్వామి వారిని బాలాలయంలో ఊరేగింపు వుంటుందని అన్నారు. బాలాలయంలో ఈ ఏడాదే చివరి బ్రహ్మోత్సవాలు. వచ్చే ఏడాది ప్రధానాలయంలోనే బ్రహ్మోత్సవాలు, బ్రహ్మోత్సవాలకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్టి, విప్ గొంగిడి సునిత, దేవదాయశాఖ కమీషనర్ అనిల్ కుమార్ హాజరు కానున్నారని ఆమె అన్నారు.
Tags; Yadadri Annual Brahmotsavam from March 4