యాదవ యువత మార్గదర్శకులుగా నిలవాలి

పుంగనూరు ముచ్చట్లు:

సమాజానికి యాదవ యువత మార్గదర్శుకులుగా నిలవాలని , ఆమేరకు యువత ఉన్నత రంగాలలో రాణించాలని యాదవ్‌ ఎంప్లాయ్సి సోసైటి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక శ్రీకృష్ణ ఆలయంలో యాదవ ఎంప్లాయ్సి సోసైటి ఆధ్వర్యంలో 500 మార్కులు సాధించిన వివిధ విద్యార్థులకు బహుమతులు, సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. అధిక మార్కులు సాధించిన బాషితా యాదవ్‌, యశ్విత యాదవ్‌, వెంకటేష్‌ యాదవ్‌, తదితర విద్యార్థులకు నగదు, బహుమతులతో పాటు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు అన్ని రంగాలలో స్థిరపడి, తమంతకుతాము ఆర్థికాభివృద్ధి చెందేలా భవిష్యత్తుని నిర్ధేశించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు భాస్కర్‌ యాదవ్‌, బుడ్డన్న, వెంకట్రమణప్ప, మోహన్‌, కృష్ణమూర్తి, గంగులమ్మ, సరోజ, నారాయణ, వెంకటరెడ్డి, మునిరాజ, ఆనంద్‌, రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Yadava youth should stand as mentors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *