భక్తజనులతో కిటకిటలాడిన యాదాద్రి పుణ్యక్షేత్రం

Yadavri Shrine is the pilgrimage to the devotees

Yadavri Shrine is the pilgrimage to the devotees

Date:01/01/2019
యాదాద్రి ముచ్చట్లు:
ఏడాదంతా ఇక్కట్లు లేని జీవనం కొనసాగేలా తన దరికి చేరి విశ్వసించిన భక్తజనులను భక్తవత్సలుడు ఆశీర్వదించారు. నమ్మితే చాలు వెన్నంటి ఉంటానని స్థంభోద్బవుడు అభయమిచ్చాడు. 2019 సంవత్సరం రోజైనా మంగళవారం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తజనులతో యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. నూతన ఆంగ్ల సంవత్సరం మొదటిరోజు క్షేత్ర సందర్శన చేసి ఇష్ట దేవుడి కృప పొందాలన్న ఆశయంతో వచ్చిన భక్తుల్లో అధికంగా నగరవాసులు సోమవారం రాత్రి నుంచి భక్తులు అర్ధరాత్రి యాదగిరిగుట్టకు చేరుకున్నారు. 2018 కు వీడ్కోలు పలికారు. ముందస్తుగా ప్రకటించినట్లు మంగళవారం వేకువజాము నుంచే ఆలయ అధికారులు,అర్చకులు పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయాన భక్తులు రద్దీ సాధారణం గానే ఉంది.
మధ్యాహ్నం నుంచి ఊహకందని రీతిలో భక్తుల సంఖ్య పెరిగి ఆలయ పరిసరాలు దర్శనం సముదాయాలు,మండపాలు పోటెత్తాయి. దీంతో భక్తులకు ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితులు ఏర్పడింది.  ప్రత్యేక దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వీధులు నిండిపోయాయి.  పిల్లాపాపలతో భక్తులు అసౌకర్యానికి  లోనయ్యారు. ప్రసాదాల కై గంటలకొద్దీ వేచి ఉండాల్సి వచ్చింది.  పులిహోర, లడ్డూ ప్రసాదాల కౌంటర్లు బారులుతీరి కనిపించారు. బాలాలయంలో దైవ దర్శనాలు త్వరతగతిన జరిగేందుకుఆలయ ఈవో గీత అక్కడే తిష్టవేసి శీఘ్ర దర్శనాలు కొనసాగించారు.
మంగళవారం  స్వామివారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం కావడం కొత్త సంవత్సరం ఈ రోజే కావడం ఈరోజు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
బాలాలయంలో వేకువజామున మూడు గంటలకు సుప్రభాతం చేపట్టి ప్రతిష్ట మూర్తులకు అభిషేకం జరిపారు.  స్వాతి నక్షత్రం కావున శతఘటాభిషేకం ఘనంగా నిర్వహించారు బిందెతీర్థం, బాల భోగము చేపట్టి ఉత్సవమూర్తులను పంచామృత అభిషేకించి తులసి దళాలతో అభిషేకం జరిపారు.సహస్ర నామాల పట్టణంతో అష్టోత్తర శత ఘ ట్టాభిషేకం కొనసాగింది మహా మండపంలో జరిగిన అష్టోత్తరం పలువురు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.  క్షేత్ర సందర్శనకు వచ్చిన భక్తులు కుటుంబ సభ్యులతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
Tags:Yadavri Shrine is the pilgrimage to the devotees

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *