అమ్మవారి అనుగ్రహం తోనే యాగం- టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహంతోనే నవకుండాత్మక శ్రీ యాగం నిర్వహిస్తున్నాని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రారంభమైన యాగంలో సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 50 సంవత్సరాల క్రితం చిన జీయర్ స్వామి తాత ఈ యాగం చేశారని ఆయన చెప్పారు. ఆ తరువాత అమ్మవారు తమకు ఈ భాగ్యం కల్పించారని అన్నారు. దేశం, రాష్ట్రం క్షేమంగా ఉండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, గో సంతతి అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ నెల 27 వ తేదీ వరకు యాగం నిర్వహిస్తున్నామన్నారు. కోవిడ్ వల్ల యాగం ఏకాంతంగా నిర్వహిస్తున్న దువల్ల , భక్తులు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే అవకాశం కల్పించామని సుబ్బారెడ్డి వివరించారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags: Yagam with the grace of Goddess- TTD Chairman YV Subbareddy