వైసీపీలో యలమంచిలి రవి

Date:13/04/2018
విజయవాడ ముచ్చట్లు:
టీడీపీలో తనకు సరైన గౌరవం దక్కలేదని మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి చెప్పారు. కొందరు తనను టీడీపీలో చాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఒక దశలో తాను టీడీపీలో ఉన్నానా లేదా అని బాధేసిందన్నారు. శనివారం వైఎస్ జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరుతున్నాని.. . ఉదయం 9గంటలకు కనకదుర్గమ్మ వారథి వద్ద జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.టీడీపీ మంత్రులు తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని.. అప్పుడు బాధపడ్డానన్నారు. అందుకే గౌరవం లేని టీడీపీలో ఉండకూడదని వైసీపీలో చేరుతున్నట్టు చెప్పారు. తనను ఉపయోగించుకుని , టికెట్ ఇస్తామని చెప్పి మోసం చేశారని వ్యాఖ్యానించారు.తాను ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వైసీపీలో పనిచేస్తానన్నారు. 2004, 2014లోనూ తన అవకాశాలకు గండికొట్టి భంగపడేలా చేశారని యలమంచలి రవి విమర్శించారు. మరోవైపు పార్టీలో చేరిక సందర్భంగా యలమంచలి వర్గీయులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.
Tags:Yalanchini Ravi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *