Natyam ad

పుంగనూరు మున్సిపాలిటిలో 24 నుంచి వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమం

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని 31వ వార్డులలోను ఈనెల 24 నుంచి వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఈనెల 24న భగత్‌సింగ్‌కాలనీలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమం 16 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి వార్డు సచివాలయంలోను సంక్షేమ పథకాల వివరాలు, లబ్ధిదారుల వివరాలు, అందించిన నగదు, తదితర వివరాలతో 16 సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు ప్రారంభిస్తామన్నారు. ఆసచివాలయ పరిధిలోని పూర్తి వివరాలు అందులో తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు తప్పక పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

Post Midle

పర్యటన వివరాలు..

24న భగత్‌సింగ్‌కాలనీ, 28న చంద్రమౌళిమార్కెట్‌, 29న రహమత్‌ నగర్‌, 30న తూర్పువెహోగశాల-1 లో కార్యక్రమం జరుగుతుందన్నారు. అలాగే డిసెంబర్‌ 1న తూర్పువెహోగశాల 2వ సచివాలయంలో జరుగుతుందన్నారు. అలాగే 4న తేరువీధి 1వ సచివాలయం, 5న తేరువీధి 2వ సచివాలయంలో 6న నానబాలవీధి సచివాలయం, 7న తేరువీధి 3వ సచివాలయం, 8న తేరువీధి 4వ సచివాలయం, 11న బీడి కాలనీ 1వ సచివాలయం, 12న బీడి కాలనీ 2వ సచివాలయం, 13న గోకుల్‌ సర్కిల్‌ సచివాలయం, 14న కొత్తయిండ్లు 1వ సచివాలయం, 15న కొత్తయిండ్లు 2వ సచివాలయం, 18న కొత్తపేట సచివాలయాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు.

Tags: YAP Needs Jagan program from 24th in Punganur Municipality

Post Midle