పుంగనూరులో వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమం

పుంగనూరు ముచ్చట్లు:

మున్సిపాలిటి పరిధిలోని 31వ వార్డులలోను శుక్రవారం నుంచి వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని భగత్‌సింగ్‌కాలనీలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమం 16 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రతి వార్డు సచివాలయంలోను సంక్షేమ పథకాల వివరాలు, లబ్ధిదారుల వివరాలు, అందించిన నగదు, తదితర వివరాలతో 16 సచివాలయాల్లో డిజిటల్‌ బోర్డులు ప్రారంభిస్తామన్నారు. ఆసచివాలయ పరిధిలోని పూర్తి వివరాలు అందులో తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు తప్పక పాల్గొని జయప్రదం చేయాలన్నారు.

 

Tags: YAP Needs Jagan program in Punganur

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *