వైఏపీ నీడ్స్ జగన్ రికార్డు సృష్టించడమే -ఎంపీపీ భాస్కర్‌రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం దేశంలోనే రికార్డు సృష్టిస్తోందని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి మండలంలోని సింగిరిగుంట గ్రామంలో వైఏపీ నీడ్స్ కార్యక్రమాన్ని సర్పంచ్ ఆంజప్ప, మండల పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లె చెంగారెడ్డి, సచివాలయల కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి, ఆధ్వర్యంలో ప్రజల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కూడలీలో వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరించారు. మా నమ్మకం నువ్వే జగన్ అనే డిజిటల్ బోర్డును ఆవిష్కరించారు. ప్రజలతో మమేకమై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లె నిద్ర చేపట్టారు. ప్రజలతో కలసి విందు భోజనాలు చేపట్టారు. ఇక్కడ జరిగిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ ప్రజలకు నవరత్నాల పథకాల ద్వారా ఇప్పటి వరకు సింగిరిగుంట ఎంపీటీసీ పరిధిలో రూ.28.63 కోట్లు ప్రజలకు పంపిణీ చేశామని తెలిపారు. ఏ ఒక్కరికైన పథకాలు అందకుండ ఉంటే తెలియజేయాలన్నారు. రాష్ట్ర మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డిల నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. మ్యానిఫెస్టోలోని 98 శాతం పథకాలను అమలు చేసి దైర్యంగా ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగమని చెబుతున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే చరిత్ర సృష్టించారని ఎంపీపీ కొనియాడారు. జగన్ ముఖ్యమంత్రిగా ఎందుకు అవసరం అనే అంశాలపై ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరు జగనన్నను రెండవ సారి ముఖ్యమంత్రిగా చేసుకుంటామని హామి ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని రెండవసారి ఆశీర్వధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు జయరామిరెడ్డి, లక్ష్మీనారాయణ, నాగభూషణం, మోహన్‌రెడ్డి, ఆంటోని, కృష్ణారెడ్డి, ఆనంద తదితరులు పాల్గొన్నారు.

Tags: YAP needs Jagan to create a record – MPP Bhaskar Reddy
