టీడీపీ వాహనాలపై వైసీపీ కార్యకర్తలు దాడి.

రాయచోటి ముచ్చట్లు:

 

రాయచోటి మండలం బోయపల్లె వద్ద టీడీపీ వాహనాలపై వైసీపీ కార్యకర్తలు దాడి. వైసీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన వాహనాలు. మాధవరం గ్రామంలో టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన విందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి టీడీపీ వాహనంలో. ఈ దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. దాడి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి దాడిలో గాయపడిన బాధితులతో కలిసి రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వైసీపీ నేతలను 24 గంటల్లో అరెస్ట్ చేయాలని ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి పోలీసులను కోరారు.

 

Tags: YCP activists attacked TDP vehicles.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *