ప్రచార రథం డ్రైవర్ కి గాయాలు
ప్రజాస్వామ్యంలో ఇది తగునా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
స్వతంత్ర దేశంలో ఇలాంటి చర్యలు అప్రజా స్వామీకం
మరోసారి ఇలాంటి చర్యలకు ప్రేరేపిస్తే ఖబడ్దార్ మేము కూడా మీ బాష లోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది
ఇలాంటి చర్యలుకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
ఇటువంటి చర్యలను చట్టపరంగా ఎదుర్కొంటాం దాడులు చేసిన వారికి శిక్ష పడేలా చేస్తాం
ఇలాంటి దాడులు ఎన్ని చేసినా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపలేరు
రాయచోటి ముచ్చట్లు:
ఆదివారం రోజు మధ్యాహ్నం రామాపురం మండలం కల్పనాయనచెరువులో కొంతమంది వైసీపీ గూండాలు తెలుగుదేశం ప్రచార రథంపై దాడి చేసి డ్రైవర్ని త్రివరంగా గాయపరిచారు ఈ విషయం తెలుసుకొని రాయచోటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెంటనే వారి అనుచరుగణంతో దాదాపు 50 వాహనాలలో అక్కడికి చేరుకున్న ఆయన మాట్లాడుతూ.ప్రచార రథాలపై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి భాషలోనే తిరిగి సమాధానం చెప్పాల్సి వస్తుందని పేర్కొన్నారు. వారి పైన దాడులు చేసే అవకాశం ఉన్న మేము ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఈ దాడి చేసిన వారి పైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.
Tags: YCP attack on Telugu Desam campaign chariot