– జోగి రమేశ్ చుట్టూ ఉచ్చుబిగిస్తున్న ప్రభుత్వం
అమరావతీ ముచ్చట్లు:
ఇలా ల్యాండ్ స్కాంలో జోగి కుమారుడు అరెస్టు అయితే…. ఆయనపైనా అరెస్టు కత్తి వేలాడుతోందనే టాక్ వినిపిస్తోంది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగిపై ఇప్పటికే కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సీఐడీ జోగికి నోటీసులు జారీ చేసింది.అయ్యో.. పాపం మోసం పోయారట… బీసీలను తొక్కేయాలనే అరెస్టులు చేస్తున్నారట… రెడ్‌బుక్ రాజ్యాంగం వల్లే కేసులు నమోదు చేస్తున్నారట…. అగ్రిగోల్డ్ కేసులో మాజీ మంత్రి జోగి కుటుంబ సభ్యులది ఏ తప్పులేదట… వైసీపీకి చెందిన మాజీ మంత్రులు మాటలు వింటుంటే.. నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లే ఉంది కదూ…. సర్వే నెంబర్లు మార్చేసి అగ్రిగోల్డ్ భూములను దోచేసి… ఆధారాలతో సహా దొరికిపోతే… వేరొకరిపై నెపం నెట్టేయడం తప్ప ఇంకేమి చేస్తారంటున్నారు కూటమి నేతలు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జోగిపై చర్యలు ఉంటాయనే అంతా ఊహించినా…. అనూహ్యంగా ఆయన కుమారుడు ఇరుక్కోవడమే ఇక్కడి ట్విస్టు. ఇక జోగి వంతు కోసం వేచి చూస్తున్నారట టీడీపీ కార్యకర్తల
Tags: YCP leader in a situation where there is no way to escape..