బాబుపై వైసీపీ సెటైర్లు

Date;27/02/2020

బాబుపై వైసీపీ సెటైర్లు

ముచ్చట్లు:

డీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన బాబుపై విమర్శలు గుప్పించారు. ‘‘చంద్రబాబు నార్సిస్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. తను లేకపోతే ప్రపంచమే లేదనే భ్రాంతి. అందరూ పనికిమాలిన వారనే భావన దీని లక్షణాలు. హింసను ప్రేరేపించేలా మాట్లాడటం, ప్రోత్సహించడం దాని కోవలోకే వస్తాయి’’ అని వైఎస్సార్సీపీ నేత ఎద్దేవా చేశారు.
చంద్రబాబు కొండ మీది నుంచి జారి పడుతూ.. మధ్యలో చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతున్నారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదంటే పట్టు తప్పి బాబు అగాథంలో పడిపోవచ్చన్నారు. అంతటి నిస్సహయ స్థితిలోనూ ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు అంటూ విజయసాయి సెటైర్లు వేశారు

 

Tags;YCP Setters on Babu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *