గడపగడపకు వైసీపీ

ఏలూరు ముచ్చట్లు:

వైసీపీ నేతలు ఇంటింటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మూడేళ్ల పాలనలో ఒక్కో ఇంటికి ఎంత ఇచ్చామో చెబుతూ పత్రాలు కూడా తీసుకుని బయలుదేరుతున్నారు. లబ్దిదారుల జాబితా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల దగ్గర నుంచి వైసీపీ నేతలు తీసుకున్నారు. తాము వెళ్లే ప్రతీ కాలనీలో వారిని కలవడంతో పాటు.. కొత్తగా ఎవరికైనా పథకాలు కావాలమో రాసుకుంటారు. ఇంత కాలం ఎందుకు ఇవ్వలేదని వచ్చేప్రశ్నలకు సావధానంగా సమాధానం చెప్పి… సానుకూలత తెచ్చుకోవాలని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇంకా ఎన్నికలకు రెండేళ్లు ఉంది. అయితే జగన్ మాత్రం ఇప్పట్నుంచే జనాల్లోకి పోవాలని నేతలను ఒత్తిడి చేస్తున్నారు. పార్టీ నేతలు ఈ మూడేళ్ల కాలంలో తాము ఏం చేశామో చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎమ్మెల్యేల స్థాయిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. కింది స్థాయిలో ఉపాధి హామీ పనులతో ఆర్బీకేలు.. ఇతర పనులను చేపడితే వాటికి బిల్లులు రాలేదు. దీంతో గ్రామాల్లో క్యాడర్ మరో పైసా అయినా పార్టీ కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదు. మరో వైపు పన్నులు..పెరిగిపోయిన నిత్యవసర వస్తువుల ధరలు.. అధికార పార్టీగా వైసీపీ నేతలకు దడ పుట్టిస్తున్నాయి. ఏ చిన్నఘటన జరిగినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలి కాలంలో వ్యతిరేకత బాగా పెరిగిందనడానికి సోషల్ మీడియాలో కనిపిస్తున్న వ్యతిరేకతే కారణం అని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ నేతలు ఎంత మేర జోరుగా ప్రజల్లోకి వెళ్తారో.. వారి వద్ద నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాల్సి ందే

 

Post Midle

24 సీట్లపై గురి
గత ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన వైఎస్సార్‌సీపీ.. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపుగా స్వీప్ చేసేసింది. కాకపోతే ఆ నియోజకవర్గాల్లో మాత్రం.. ఎందుకనో విక్టరీ కొట్టలేకపోయింది. అందుకే, ఇప్పుడో కొత్త టార్గెట్‌ పెట్టుకుంది. లాస్ట్‌ టైమ్‌ మిస్సయిన స్థానాల్ని కూడా చేజిక్కించుకునేలా కొత్త స్కెచ్‌ వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థులు సైతం ఊహించని విజయంతో అధికారం దక్కించుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ… ఈసారి మరింత పదునైన వ్యూహాలతో ఎన్నిలకు సిద్ధమవుతోంది. ఓవైపు ప్రభుత్వ కార్యక్రమాలు చూస్తూనే… మరోవైపు పార్టీ పటిష్టతపైనా ఫోకస్‌ పెట్టిన సీఎం జగన్మోహన్‌రెడ్డి… సరికొత్త వ్యూహాలతో ప్రత్యర్థులకు సవాల్‌ విసిరేందుకు సిద్ధమవుతున్నారు.ఏపీలోని 175 స్థానాలకు గాను… గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు గెలిచిన వైసీపీ… ప్రత్యర్థులకు 24 స్థానాల్లో మాత్రమే ఛాన్సిచ్చింది. అందులో 23 టీడీపీ, ఒక స్థానం జనసేన గెలుచుకుంది. ఆ 24మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లోనూ కొందరు అధికార పార్టీకి మద్దతుగా మారిపోయారు, అది వేరే విషయం. అయితే, ఆ 24స్థానాలు ఎందుకు ఓడిపోయాం.. అవి కూడా గెలిచేస్తే ఓ పనైపోతుంది? అనే అంశంపై ఫోకస్‌ పెట్టింది వైసీపీ హైకమాండ్‌. ఈసారి ఆ స్థానాలు కూడా తమ ఖాతాలో వేసుకోవాలని కంకణం కట్టేసుకున్నట్టే కనిపిస్తోంది.2019ఎన్నికల్లో దాదాపు స్వీప్‌ చేసింతగా దూసుకెళ్లిన వైసీపీ… ఆ 24 చోట్ల మాత్రం వెనకబడింది. అందుకే, ఓడిన 24 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్‌.. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. గడపగడప కు వైస్సార్ కాంగ్రెస్‌ కార్యక్రమం సందర్భంగా… ఆ నియోజకవర్గాలకు ఇంచార్జ్‌ల విషయంలోనూ అధిష్టానం క్లారిటీ ఇవ్వనుంది. వాటిలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి బలమైన నేతలకు ఇంచార్జ్‌లుగా బాద్యతలు అప్పగించింది.

 

Tags: YCP to Gadapagadap

Post Midle
Natyam ad