ఎంపీ పదవులకు యడ్యూరప్ప,  శ్రీరాములు రాజీనామా

Date:19/05/2018
బెంగళూర్ ముచ్చట్లు:
విశ్వాసపరీక్ష నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర్ బోపయ్య ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన యడ్యూరప్ప, బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీరాములు కూడా శాసనసభ్యులుగా ప్రమాణం చేశారు. అంతకుముందు వీరిరువురూ తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. వీరితో పాటు జేడీఎస్ ఎంపీ సీఎస్ పుట్టరాజు కూడా రాజీనామా సమర్పించారు. వీరి రాజీనామాలను లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్ ఆమోదించారు. 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున కర్ణాటక నుంచి లోక్‌ సభ సభ్యులుగా ఎంపికైన యడ్యూరప్ప, శ్రీరాములు తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి గెలుపొందారు. షికారిపుర నియోజకవర్గం నుంచి యడ్యూరప్ప, మొళకాల్మూరు నియోజకవర్గం నుంచి శ్రీరాములు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. పుట్టరాజు జేడీఎస్ తరఫున మాండ్య నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  ఉదయం విధాన సౌధలో వీరిరువురూ ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకూ యడ్యూరప్ప షిమోగా నుంచి, శ్రీరాములు బళ్లారి నుంచి ఎంపీలుగా కొనసాగారు.
TAgs:Yeddyurappa and Sriramulu resign to MPs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *