కలకలం రేపుతున్న యడ్యూరప్పఆడియో

Yeddyurappa apologizes to the calm

Yeddyurappa apologizes to the calm

Date:19/05/2018
బెంగళూర్ ముచ్చట్లు:
బలపరీక్షకు ముందు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం తర్వాత యడ్యూరప్ప విశ్వాస పరీక్షను ఎదుర్కోబోతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పేల్చిన ఆడియో బాంబ్ కలకలంరేపింది. చేస్తున్న సంభాషణను బయటపెట్టింది. అసెంబ్లీకి వెళ్లేముందు మీడియాకు ఈ ఆడియో టేపును విడుదల చేశారు. అందులో యడ్యూరప్ప ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు గాలం వేసే ప్రయత్నాలు చేశారు. తమకు మద్దతు ఇస్తే మంత్రి పదవితో పాటూ కొంత డబ్బును ఆఫర్ చేసినట్లు ఆడియో టేపు సారాంశం. నిన్న కూడా ఓ ఆడియో టేప్ బయటపడింది. అందులో మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి తమ ఎమ్మెల్యేతో బేరసారాలు చేసినట్లు కాంగ్రెస్ ఆరోపించింది. రాయచూర్ రూరల్ ఎమ్మెల్యే బసవనప్న గైడతో గాలి సంప్రదించారని చెప్పింది. ఫోన్ సంభాషణలో… గతంలో జరిగిన విషయాలను మరచిపోండి. మీకు ఏం కావాలో జాతీయ అధ్యక్షుడే నేరుగా మాట్లాడతారు. మంత్రి అవుతారు… నేరుగా పెద్దవాళ్లతో మాట్లాడిస్తా. శివగౌడ నాయక్‌ నా మాట విని మంత్రి అయ్యారు… రాజీవ్‌గౌడ నా వల్లే డెవలప్‌ అయ్యారు. శివగౌడ నాయక్‌ గెలిచినా ప్రయోజనం లేదు. నువ్వు సంపాదించిన ఆస్తి కన్నా వందరెట్లు సంపాదిస్తావంటూ గాలి జనార్దన్‌రెడ్డి బసన గౌడతో అన్నారు. దీనిపై స్పందించిన బసన్న… చివరి పరిస్థితుల్లో నాకు టికెట్‌ ఇచ్చి కాంగ్రెస్‌ ఆదుకొంది. కాంగ్రెస్‌కు నేను ద్రోహం చేయలేను అని ఎమ్మెల్యే చెప్పారు. అయితే ఈ ఆడియో టేపులు నిజమో కాదో తేలాల్సి ఉంది.
TAgs:Yeddyurappa apologizes to the calm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *