వైఎస్‌ఆర్‌సిపి పార్టీ నేతలకు నియామక పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date:06/10/2018

పుంగనూరు ముచ్చట్లు:

చిత్తూరు జిల్లా వైఎస్‌ఆర్‌సిపి సేవాదళ్‌ కార్యదర్శిగా ఎం.మోహసిన్‌ఖాన్‌ను నియమించారు. నియామక పత్రాలను శనివారం ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు. అలాగే జిల్లా కార్యవర్గ సభ్యుడుగా సుల్తాన్‌పాషాను నియమించారు. అలాగే పట్టణ ముస్లిం మైనార్టీ జనరల్‌ సెక్రటరీగా ఎస్‌.నజీర్‌ను నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమింపబడిన మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు అధిక ప్రాధాన్యతను కల్పించి, ఆదుకుంటున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడుగుజాడల్లో పార్టీని అన్నివిధాల పటిష్ట పరుస్తామన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కి దక్కిందన్నారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలలో చైతన్యం తీసుకొచ్చి, పూర్తి స్థాయిలో వైఎస్‌ఆర్‌సిపి విజయానికి కృషి చేస్తామన్నారు.

 

ఎరువు.. ధర దరువు..

Tags: Yeddyurappa MLA Pendireddy handed over appointment letters to party leaders

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *