యడ్యూరప్పకు లోక్ సభ ఎన్నికలు సవాల్

Yeddyurappa to challenge Lok Sabha elections

Yeddyurappa to challenge Lok Sabha elections

Date:13/03/2019
బెంగళూరు ముచ్చట్లు:
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్పకు లోక్ సభ ఎన్నికలు సవాల్ గా మారాయి. ఇప్పటికే డెబ్భయి వడిలో పడిన యడ్యూరప్ప నాయకత్వానికి ఇదే ఆఖరి ఎన్నికలు కావచ్చు. గత విధాన సభ ఎన్నికలలో అత్యధిక మెజారిటీ సీట్లు సాధించినా అధికారం దక్కించుకోలేకపోయింది. అతిపెద్ద పార్టీగా కర్ణాటకలో అవతరించినా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి పదవి యడ్యూరప్పకు దూరమయింది మరోసారి కేంద్రంలో మోదీ సర్కార్ అధికారంలోకి వస్తే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మంత్రాంగం పారి తాను మరోసారి సీఎం అవుతానని ఆయన భావిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి యడ్యూరప్ప నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒకవైపు అధిష్టానంతో టచ్ లో ఉంటూనే పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలుండగా గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 17 సీట్ల దక్కించుకుంది. కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉండి కేవలం తొమ్మిది సీట్లు మాత్రమే గెలుచుకుంది. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో స్థానంలో విజయం సాధించింది. ప్రాంతీయ పార్టీ జనతాదళ్ ఎస్ గత లోక్ సభ ఎన్నికలలో రెండు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.యడ్యూరప్పకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం. కనీసం 20 స్థానాలు లక్ష్యంగా పెట్టుకుని యడ్యూరప్ప ప్రచారం చేస్తున్నారు. దక్షిణాదిన బీజేపీ బలంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక కావడంతో బీజేపీ అధిష్టానం కూడా దీనిపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. ఇప్పటికే మోదీ, అమిత్ షాలు రెండు, మూడు దఫాలు రాష్ట్ర పర్యటన చేసి వెళ్లారు.
సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత పార్టీ ఇమేజ్ మరింత పెరిగిందన్న ఆలోచనల్లో కమలనాధులు ఉన్నారు. ఈ మేరకు అభ్యర్థుల తుది జాబితాకు నేడో, రేపో కేంద్ర నాయకత్వం ఆమోద ముద్ర వేయనుంది. జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలు సయితం తమకు కలసి వస్తాయని యడ్యూరప్ప భావిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ పార్టీగా చెప్పుకునే దేవెగౌడ కు చెందిన జనతాదళ్ ఎస్ నుంచి ముగ్గురు కుటుంబ సభ్యులు పోటీ చేస్తుండటం ఆ పార్టీకి కొంత వ్యతిరేకత వస్తుందంటున్నారు. మనవళ్లను బరిలోకి దించి తప్పుడు సంకేతాలను దేవెగౌడ పంపడంతో బీజేపీకి మరింత పట్టుపెరిగిందంటున్నారు. కాంగ్రెస్ లో సయితం రాజుకున్న అసమ్మతిసెగలు తమకు అనుకూలంగా మారుతాయని యడ్యూరప్ప భావిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత ముఖ్యమంత్రి కుమారస్వామిలు ఇంకా సీట్ల పంపకాలపైనే ఉన్నారు. మొత్తం మీద కర్ణాటక లోక్ సభఎన్నికల ఫలితాలు ఎవరికి ఎలాంటి ముప్పు లేకున్నా యడ్యూరప్ప నాయకత్వానికి మాత్రం ప్రమాదమన్నది వాస్తవం.
Tags:Yeddyurappa to challenge Lok Sabha elections

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *