చిత్తూరులో యెమెన్ విద్యార్ధి ఆత్మహత్య

Date:19/02/2018
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరులో యెమాన్ దేశానికిచెందిన ఖలేద్ అనే విద్యార్థి స్థానికంగా అద్దెకు తీసుకున్న గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు . అతను  ఎస్.వి.సెట్లో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.  తల్లి ఆరోగ్యం సరిగాలేక పోవడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. అంతేకాక యెమాన్ దేశం లో అంతర్ యుద్దాలుకూడ కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు.  మృతుడు ఖాలేద్ స్థానిక మురకంబట్టులో వారి దేశానికి చెందిన హషేమ్ ఆల్ షబి అనే విద్యార్థి తో కలసి గది అద్దెకు తీసుకుని చదువుకుంటున్నారు.  కొద్ది నెలలుగా తన తల్లికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆమెను  కేరళకు తీసుకెళ్లి చికిత్స అందించాడు. తన గది లోని మిత్రుడు సైతం గత కొన్ని రోజులుగా కేరళ వైద్యం పొందుతున్నాడు. ఇటీవల మిత్రుడు కేరళకు వెళ్ళగా తన తల్లికి మందులు తీసుకోవాలని కోరాడు. కేరళ వెళ్లిన తన మిత్రుడు ఆదివారం ఖలెద్ కు ఫోన్ చేయగా ఎంతసేపటికి స్పందించలేదు దీంతొ మరో మిత్రడికి ఫోన్ చేసి గదిని పరిశీలించాలని కోరాడు. దాంతో ఖలేద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
Tags: Yemen student in Chittor suicide

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *