ఆత్మ సాక్షిగా నిన్న కాపాడుకుంటాను

Yesterday I will be saved as a soul witness

Yesterday I will be saved as a soul witness

Date:14/04/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
జమ్ముకశ్మీర్లోని కతువాలో ఎనిమిదేండ్ల బాలికని లైంగికంగా వేధించి ఆ తర్వాత బండరాయితో మోది చంపడం అందరిని కలిచి వేసింది. ఈ సంఘటనపై ప్రతి ఒక్కరు ఫైర్ అవుతున్నారు. నిందితులని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. సినీ సెలబ్రిటీలు కూడా ఈ దారుణ సంఘటనని వ్యతిరేఖిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ కూడా ఈ సంఘటనపై స్పందించింది. తన దత్త పుత్రిక నిషాని కౌగిలించుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. నా మనసు, శరీరం,ఆత్మ సాక్షిగా నీకు ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఉన్న చెడు నుంచి నిన్ను ఎల్లవేళలా రక్షించుకునేందుకు నా జీవితాన్ని నీ రక్షణం కోసం అంకితం చేస్తా. దుర్మార్గుల నుండి పిల్లలని సురక్షితంగా ఉంచాలి. మన పిల్లలని ఇంకాస్త దగ్గరగా ఉంచుకుందాం. కాపాడుకుందాం అంటూ భావోద్వేగపు ట్వీట్ చేసింది సన్నీ. డేనియల్ వెబర్ తో ఏడేళ్ళ దాంపత్యంలో ఉన్న సన్నీకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. గతేడాది మహారాష్ట్రలోని లాతూర్ నుంచి ఓ పాపను దత్తత తీసుకున్న సన్నీ, వెబర్ దంపతులకి ఈ మధ్య సరోగసి ద్వారా ఇద్దరు కవల మగ పిల్లలు జన్మించారు. ఆషెర్ సింగ్ వెబర్, నోహ్ సింగ్ వెబర్, నిషా కౌర్ వెబర్లతో మా కుటుంబం పరిపూర్ణమైంది అని సన్నీ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే.
Tags:Yesterday I will be saved as a soul witness

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *