షర్మిలకు రేవంత్ ఫోన్

ఖమ్మం  ముచ్చట్లు:


షర్మిలపై గతంలో స్వచ్చంద సంస్థ పెట్టుకున్నారని సెటైర్ వేసిన టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇప్పుడు మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తున్నారు. పాదయాత్రలో ఉన్న షర్మిలకు ఫోన్ చేసి… తమ పార్టీ నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి రావాలని ఆహ్వానించారు. తెలంగాణోల దిగజారిపోతున్న శాంతిభద్రతల పరిస్థితులు.. ఇతర అంశాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ అఖిలపక్ష భేటీకి పలు పార్టీలు హాజరవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఆయా పార్టీలను స్వయంగా పిలిచారు. ఇప్పుడు షర్మిలను కూడా పిలిచారు. రేవంత్ రెడ్డి పిలిచిన వెంటనే షర్మిల కూడా అంగీకరించారు. తెలంగాణ రాజకీయ పార్టీల్లో ఇప్పటి వరకూ షర్మిలను అంత సీరియస్‌గా తీసుకున్న వారు ఎవరూ లేరు. తొలి సారిగా రేవంత్ ఆమెను తెలంగాణ పార్టీ నేతగా గుర్తించడంతో షర్మిల కూడా రావడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. షర్మిల ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఈ మంగళవారం ఆమెదీక్ష చేశారు. బుధవారం పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. అయితే అఖిలపక్ష భేటీలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. షర్మిల ఇప్పటి వరకూ కేసీఆర్‌తో పాటు ఇతర రాజకీయ పార్టీలనూ విమర్శిస్తున్నారు. ఆ పార్టీలన్నీకేసీఆర్ తో పోరాడేందుకు భయపడుతున్నాయని విమర్శిస్తూ ఉండేవారు. ఇప్పుడు అన్ని పార్టీలతో కలిసి వెళ్లేందుకు నిర్ణయించారు.

 

Tags: Rewanth phone to Sharmila

Post Midle
Post Midle
Natyam ad