అయినా జగన్…  మళ్లీ పాత తప్పులే

Yet Jagan ... the old fault again

Yet Jagan ... the old fault again

Date:14/09/2018
రాజమండ్రి ముచ్చట్లు:
అవును…జగన్… అందుకే అంత కఠినంగా ఉన్నారు. పితాని బాలకృష్ణ లాంటి వాళ్లు పార్టీని వీడతారని తెలిసినా….. మర్రి రాజశేఖర్ లాంటి పార్టీని నమ్ముకున్న నేతలు మనస్తాపానికి గురవుతారని ముందే ఊహించినా జగన్ తన నిర్ణయాలన్నింటినీ అమలులో పెడుతున్నారు. గత ఎన్నికల్లో చేసిన తప్పిదాలను వచ్చే ఎన్నికల్లో చేయకూడదని జగన్ భావిస్తున్నారు.
అందుకే పార్టీకి కష్టపడి పనిచేసిన నేతల విషయంలో కొంత కఠిన వైఖరిని జగన్ అవలంబించక తప్పడం లేదని పార్టీ సీనియర్ నేతలు చెబుతున్నారు.ఎన్నికల్లో కేవలం లక్ష ఓట్ల తేడాతోనే అధికారానికి జగన్ దూరమయ్యారు. అనేక నియోజకవర్గాల్లో వందల ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో అభ్యర్థి ఇమేజ్ ఎంత ముఖ్యమో ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే వారూ అంతే అవసరం.
అధికార తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులను పంచిపెట్టి అధికారంలోకి వచ్చిందన్నది వైసీపీ నేతల భావన. గత ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన అభ్యర్థులు సక్రమంగా ఓట్లను పోలింగ్ చేసుకోలేక పోవడం, వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేక పోవడంతోనే వెయ్యి లోపు ఓట్ల తేడాతో దాదాపు పది నియోజకవర్గాలను వైసీపీ పోగొట్టుకోవాల్సి వచ్చిందంటున్నారు.
ఈసారి మళ్లీ అలాంటి తప్పులను రిపీట్ చేయకూడదని జగన్ భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా దాదాపు ఏడాది క్రితమే జగన్ నియమించారు. ప్రశాంత్ కిషోర్ టీం పలు దఫాలుగా సర్వేలు నిర్వహించి గెలిచే అభ్యర్థుల జాబితాను రూపొందించింది.
జగన్ ప్రజాసంకల్ప పాదయాత్ర, ఆ తర్వాత కూడా ఆ యా నియోజకవర్గాల్లో పీకే టీం సర్వేలు నిర్వహించింది. వీరిలో కొంతమంది నియోజకవర్గ ఇన్ ఛార్జులకు ప్రజాబలం లేదని తేలడంతోనే నియోజకవర్గాల సమన్వయ కర్తలను జగన్ మారుస్తున్నారన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది.పితాని బాలకృష్ణను ముమ్మడివరం నియోజకవర్గ బాధ్యుడిగా జగన్ తొలుత నియమించారు. అయితే ఆయన విజయావకాశాలపై సర్వేలో తేడా రావడంతో అక్కడ పొన్నాడ సతీష్ కు నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు.
సర్వేలో సతీష్ కే ఎక్కువ మార్కులు పడటంతో బాలకృష్ణ పార్టీని వీడతారని తెలిసినా జగన్ కాంప్రమైజ్ కాలేదని ఒక సీనియర్ నేత చెప్పారు. అలాగే చిలకలూరిపేట నియోజకవర్గంలో కూడా మర్రిరాజశేఖర్ కు సర్వేలో అనుకూలంగా రాకపోవడంతోనే విడదల రజనీకుమారిని నియమించారంటున్నారు. ఏలూరులో ఆళ్ల నానికి ఇచ్చిందీ ఇదే ఫార్ములాతోనే.
నెల్లూరు జిల్లాలో వెెంకటగిరి నియోజకవర్గంలో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డిని కాదని ఆనం రామనారాయణరెడ్డికి ఇచ్చిందీ అందుకే నంటున్నారు. ఇలాంటి నియోజకవర్గాలు ఇంకా అనేకం ఉన్నా అభ్యర్థుల ఎంపిక విషయంలో జగన్ ఆచితూచి వ్యవహరిస్తున్నారంటున్నారు. పార్టీకి సేవ చేసిన వారిని జగన్ ఎన్నడూ విస్మరించరని, అధికారంలోకి వస్తే వారికి తగిన పదవులు ఖచ్చితంగా లభిస్తాయని వారంటున్నారు.
Tags: Yet Jagan … the old fault again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *