ఇంకా అందని తుంగభద్ర నీరు

Date:12/03/2018
కర్నూలు ముచ్చట్లు:
కర్నూలులోని తుంగభద్ర జలాశయం నీరు వారం రోజులైనా జిల్లాకు చేరకపోవడంతో జలవనరుల శాఖ అధికారులకు బెంగ పట్టుకుంది. గత నెల 23న పవర్‌ కెనాల్‌ ద్వారా విడుదల చేసినా.. తుంగభద్ర నది పూర్తిగా తడారి పోవడంతో ప్రవాహం నెమ్మదించింది.4వ తేదీ నాటికే వాటా విడుదల ముగియనుండ టంతో అసలు నీరు రాకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇక కాస్తో కూస్తో వచ్చిన నీటిని ఎండిపోతున్న ఆయకట్టు పొలాలకు ఇవ్వాలో.. కర్నూలు నగర ప్రజల దాహం తీర్చాలో అనే మరో ప్రశ్న  అధికారుల ముందుంది.టీబీ డ్యాంలోని కేసీ కోటా నీరు విడుదల చేయాలని సుమారు రెండు నెలలకుపైగా జల వనరుల శాఖ ఇంజినీర్లు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. చివరకు ఆయకట్టుదారుల నుంచి, నదీతీర గ్రామాల ప్రజల నుంచి వ్యతిరేకత రావడం, ప్రతిపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న తరుణంలో గత నెల 23న తెలంగాణ కోటాతో కలిసి 4.37 టీఎంసీల నీటిలో నుంచి 2 టీఎంసీల నీటిని డ్యాం నుంచి తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో కేసీ కోటాలో నుంచి 2 వేలు, ఆర్డీఎస్‌ కోటాలో నుంచి 1850 క్యుసెక్కుల నీటితో కలిíపి పవర్‌ కెనాల్‌ ద్వారా విడుదల చేశారు. అయితే నీరు ఆర్డీఎస్‌కు కూడా చేరకముందే తెలంగాణ కోటా పూర్తి కావడం, ప్రస్తుతం డ్యాం నుంచి కేవలం 2 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతుండటంతో సుంకేసుల బ్యారేజీకి ఎప్పుడు చేరుతుందోనని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. గత నెల 23న నీటిని విడుదల చేసిన తుంగభద్ర జలాలు ప్రస్తుతం ఆర్డీఎస్‌ ఆనకట్టకు చేరాయి. నది తడారి పోవడంతో ప్రవాహం నెమ్మదిగా ఉంది. 0.5 టీఎంసీల నుంచి 0.75 టీఎంసీల నీరు రావొచ్చు. ఒక వేళ 1 టీఎంసీ నీరు వస్తే ఆయకట్టుకు కొంత, తాగు నీటికి కొంత కేటాయించుకుని వినియోగిస్తాం. – శ్రీరామచంద్రామూర్తి,ఎస్‌ఈ, జల వనరుల శాఖ.
Tags: Yet untouched Tungabhadra water

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *