కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో  యోగా దినోత్సవం

కడప ముచ్చట్లు:


జిల్లా ఎస్.పి  కే.కే.ఎన్ అన్బురాజన్  ఆదేశాల మేరకు మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.  స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్.పి మహేష్ కుమార్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజునే కాకుండా ప్రతి నిత్యం యోగా అలవర్చుకోవడం ద్వారా మానసిక ఉల్లాసం వుంటుందన్నారు. యోగా వల్ల శారీరకంగా, మానసికంగా ధృఢంగా మారతారన్నారు.   యోగా అనేది ఓ దివ్యౌషధం అని గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, ఆర్.ఐ లు శ్రీనివాసులు, మహబూబ్ బాషా, సోమశేఖర్ నాయక్, ఆర్.ఎస్.ఐ లు, ఏ.ఆర్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Tags:: Yoga Day at Kadapa Police Parade Ground

Post Midle
Post Midle
Natyam ad