Natyam ad

భక్తులకు అందుబాటులో యోగదర్శనం పారాయణం- డయల్ యువర్ ఈఓలో  ఎవి.ధర్మారెడ్డి

తిరుమల ముచ్చట్లు:

తిరుమల నాదనీరాజనం వేదికపై పారాయణం చేసిన యోగదర్శనం శ్లోకాలను, వాటి అర్థాలను త్వరలో యూట్యూబ్ లో భక్తులకు అందుబాటులో ఉంచుతామని టిటిడి ఈఓ   ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టిటిడి ఈఓ భక్తులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

Post Midle

1. సరితారెడ్డి – కరీంనగర్.

ప్రశ్న : ఆన్లైన్ లో శ్రీవారిసేవకు నమోదు చేసుకున్నప్పుడు బ్లాక్ అవుతోంది.

ఈఓ: శ్రీవారి సేవకు వచ్చి వెళ్లాక తిరిగి 90 రోజుల తరువాత మాత్రమే ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి.

2. జమునాదేవి – చెన్నై

ప్రశ్న : రథసప్తమి నాడు దర్శనానికి వచ్చాం. ఎక్కువ దూరం నడవాల్సి వచ్చింది. చలికి ఇబ్బందులు పడ్డాం.

ఈఓ: రథసప్తమినాడు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చారు. మాడవీధుల్లో 2 లక్షల మంది వాహనసేవలను వీక్షించారు. మిగిలిన వారు బయట ఉండిపోయారు. ఇలాంటి విశేష పర్వదినాల సమయంలో కొందరు భక్తులకు అసౌకర్యం కలుగుతుంది. చలికి ఇబ్బందులు పడకుండా షెల్టర్ ఏర్పాటు చేశాం. గతం కంటే ఎక్కువగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశాం.

3. అప్పన్న – విశాఖ

ప్రశ్న : శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఆలయాలు నిర్మిస్తున్నారు. ఈ నిధులతో ప్రతి జిల్లా కేంద్రంలో వేద పాఠశాల ఏర్పాటు చేయండి. 300/- దర్శన టికెట్ల బుకింగ్ లో పేమెంట్ గేట్ వే వద్ద సమస్య వస్తోంది. ఈ-దర్శన్ కౌంటర్లు తెరిపించి దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు అందుబాటులో ఉంచండి

ఈఓ : టిటిడి ఆధ్వర్యంలో తిరుమల ధర్మగిరితో పాటు ఏడు పాఠశాలలు ఉన్నాయి. ఇక్కడ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా పెరిగితే నూతన పాఠశాలను ఏర్పాటు చేస్తాం. 300/- దర్శన టికెట్ల బుకింగుకు సంబంధించి వెబ్సైట్లో ఎలాంటి లోపాలు లేవు. జియో సంస్థ సహకారంతో క్లౌడ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. టికెట్లు 30 నిమిషాల్లో బుక్ అయిపోతున్నాయి. ఇటీవల ప్రారంభించిన టిటిదేవస్థానమ్స్ యాప్ ను ప్రయత్నించండి.

4. నాగరాజు – విజయవాడ

ప్రశ్న : 2009లో పోస్టు ద్వారా సేవా టికెట్ బుక్ చేసుకున్నాను. ఇందులో నా పేరుకు బదులుగా మా అమ్మాయి పేరు మార్పించుకోవాలి.

ఈఓ: మీకు ఫోన్ చేసి వివరాలు తెలియ చేస్తాం.

5. దుర్గాభవాని – తిరుపతి

ప్రశ్న : టిటిడి ఫ్యామిలీ పెన్షనర్ని. వైకుంఠ ఏకాదశి దర్శనానికి వచ్చినప్పుడు శ్రీవారి ఆలయంలో ఒక ఉద్యోగి దురుసుగా ప్రవర్తించి దుర్భాషలాడారు.

ఈఓ : పూర్తి వివరాలు తెలియజేస్తే సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటాం.

6. శివానంద్ – నెల్లూరు

ప్రశ్న : ఆన్లైన్లో దర్శన టికెట్ల బుకింగ్ కావడం లేదు. త్వరగా అయిపోతున్నాయి.

ఈఓ : ఎక్కువ మంది ప్రయత్నించడం వల్ల ఒక్కోసారి అలా జరుగుతోంది. టిటిడి ప్రారంభించిన యాప్ లో కూడా మీరు ప్రయత్నించవచ్చు.

7. వేణు కుమార్ – ఖమ్మం

ప్రశ్న : తిరుమలలో ప్రతి పువ్వు స్వామి వారికే చెందాలి. కొందరు సేవకులు కూడా పూలు పెట్టుకుంటున్నారు. దీనిపై ప్రచారం చేయండి.

ఈఓ: ఈ అంశంపై అక్కడక్కడా బోర్డులు పెట్టి ప్రచారం చేస్తాం.

8. శ్రీనివాస్ – హైదరాబాద్

ప్రశ్న : జనవరి 31న కళ్యాణం చేయించాం. ఆలయంలో పూజారులు డబ్బులు అడుగుతున్నారు. తలనీలాలు తీసేచోట కూడా డబ్బులు అడుగుతున్నారు.

ఈఓ: ఇలాంటి విషయాలపై భక్తుల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నాం. విజిలెన్స్ నిఘా పెంచుతాం.

9. వరలక్ష్మి – బెంగళూరు

ప్రశ్న : మాకు వివాహమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పొరపాటున వర్చువల్ కళ్యాణం బుక్ చేసుకున్నాం. కళ్యాణోత్సవం టికెట్ కేటాయించండి.

ఈఓ : తప్పకుండా కేటాయిస్తాం.

10. విజయ భాస్కర్ – నరసరావుపేట, శేషగిరిరావు – హైదరాబాద్, అరుణ్ కుమార్ – హైదరాబాద్.

ప్రశ్న : ఆన్లైన్ ఆర్జిత సేవా టికెట్లు బుక్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది. కుటుంబంలో నలుగురు సభ్యులు ఉంటే ఇద్దరికే టికెట్లు బుక్ అవుతున్నాయి.

ఈవో: ఆన్లైన్ లక్కీడిప్ విధానంలో పూర్తి పారదర్శకంగా శ్రీవారి ఆర్జితసేవలను కేటాయిస్తున్నాము. నమోదు చేసుకున్న వారికి శ్రీవారి కృపతో టికెట్లు లభిస్తాయి.

11.కె.వి శివరావు – గుంటూరు

ప్రశ్న : ఆస్తమా ఉన్న వారిని కూడా వృద్ధుల క్యూలైన్ ద్వారా పంపండి.

ఈఓ: సర్టిఫికెట్ తెస్తే వృద్ధులు, దివ్యాంగుల క్యూ లైన్ ద్వారా ఆస్తమా ఉన్న వారిని పంపుతాం.

12. ప్రసాద్ – హైదరాబాద్

ప్రశ్న : భగవద్గీత తరహాలో యోగ దర్శనం పారాయణ కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లో అందుబాటులో ఉంచండి.

ఈఓ: త్వరలో అందుబాటులో ఉంచుతాం.

13. శ్రీనివాస్ – తిరుపతి

ప్రశ్న : మా అమ్మ పేరుతో డోనర్ పాస్ బుక్ ఉంది. నా పేరున బదిలీ చేయించుకోవాలి. దాతలను సుపథం నుండి కాకుండా రూ.300/- క్యూ లైన్ నుండి పంపుతున్నారు.

ఈఓ: దాతల పాస్ బుక్ బదిలీ చేసే అవకాశం లేదు. దాతలకు మాత్రమే ప్రయోజనాలు వర్తిస్తాయి. దాతలను సుపథం నుంచి పంపేందుకు ప్రయత్నిస్తాం.

14. శ్రీనివాసరావు – హైదరాబాద్

ప్రశ్న : అన్నదానానికి ఒక లక్ష రూపాయలు విరాళం ఇచ్చాము. ప్రయోజనాల గురించి తెలియజేయండి.

ఈఓ : మీకు ఫోన్ చేస్తే చేసి వివరాలు తెలియజేస్తాం.

15. శ్రీకాంత్ – మంచిర్యాల

ప్రశ్న : మా ఊర్లో పురాతన శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఆలయ అభివృద్ధికి సహకారం అందించండి. 2021లో విగ్రహాల కోసం డిడి కట్టాం. ఇంతవరకు సమాచారం లేదు.

ఈఓ : శ్రీవాణి ట్రస్ట్ కింద 2,068 ఆలయాల నిర్మాణం జరుగుతుంది. ఈ ట్రస్ట్ కింద దరఖాస్తు చేసుకోండి. మా ఇంజనీర్లు వచ్చి పరిశీలిస్తారు. త్వరలో విగ్రహాలు అందిస్తాం.

16. కృష్ణమోహన్ – వైజాగ్

ప్రశ్న : శ్రీవాణి టికెట్ బుక్ చేసుకుని దర్శనానికి వచ్చాం. శ్రీవాణి దాతలకు గదులు కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించండి.

ఈఓ: ఆన్లైన్లో శ్రీవాణి దర్శన టికెట్లు బుక్ చేసుకుని వచ్చే దాతలకు గదులు కూడా బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాం.

17. నాగేష్ – హైదరాబాద్

ప్రశ్న : తిరుమలలో పాంచజన్యం విశ్రాంతి గృహం వద్దకు వెళ్లడానికి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా ఇబ్బందిగా ఉంది. తిరుమలలో గదుల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోంది.

ఈఓ : పాంచజన్యం విశ్రాంతి గృహం కొంత లోపలికి ఉంటుంది. కావున ఇక్కడి నుండి ఉచిత బస్సులు గానీ, బ్యాటరీ వాహనాల ద్వారా గానీ రవాణా వసతి కల్పిస్తాం. తిరుమలలో గదుల కోసం ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఎస్ఎంఎస్ ద్వారా గదుల కేటాయింపు సమాచారం అందిస్తున్నాం. నేరుగా ఉపవిచారణ కార్యాలయాలకు వెళ్లి గదులు పొందవచ్చు.

18. ప్రతాప్ – చిత్తూరు

ప్రశ్న : తిరుమల అన్నప్రసాద భవనంలో ప్రసాదాలు వృథా కాకుండా ప్రకటనలు ఇవ్వండి. దివ్యదర్శనం ఎప్పుడు ప్రారంభిస్తారు. ట్యాక్సీ నిర్వాహకులు ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారు. ఉచిత బస్సుల గురించి సమాచారం తెలిపే ఏర్పాటు చేయండి.

ఈఓ : అన్నప్రసాదాలు వృథా కాకుండా తగిన చర్యలు తీసుకుంటాం. గతంలో దివ్యదర్శనం భక్తులకు లడ్డూ ఉచితంగా ఇచ్చేవారు. లడ్డూలపై సబ్సిడీని తొలగించి భక్తులందరికీ ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తున్నాం. తిరుపతిలో ఎస్ఎస్డి టోకెన్లు పొంది దర్శనానికి రావాలి. గాలిగోపురం వద్ద దివ్య దర్శనం టోకెన్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ట్యాక్సీ నిర్వాహకులపై నిఘా ఉంచుతాం. ఉచిత బస్సుల గురించి సమాచారం తెలియజేస్తాం.

19. గిరీష్ – తిరుపతి

ప్రశ్న : జనవరి 13న తిరుమలకు వచ్చాను. లడ్డూ కాంప్లెక్స్ లో వడలు భక్తులకు అందుబాటులో ఉంచడం లేదు.

ఈఓ: వడ ప్రసాదం పరిమితంగా తయారుచేస్తారు. లడ్డూ కాంప్లెక్స్ కు వచ్చిన వడలను కౌంటర్లలో సమానంగా భక్తులకు విక్రయానికి ఉంచేలా ఏర్పాట్లు చేస్తాం.

20. భావనారాయణ – గుంటూరు

ప్రశ్న : రూ.300 దర్శన స్లాట్ ఉదయం లేకపోవడంతో మాకు ఇబ్బందిగా ఉంది. నందకంలో తలనీలాల కేంద్రం వద్ద మహిళా భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

ఈఓ : దర్శన టికెట్లు కొనుగోలు చేయలేని సామాన్య భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉంటారు. ఇలా రాత్రివేళ వేచి ఉండే భక్తులకు త్వరగా స్వామివారి దర్శనం కల్పించేందుకు వీలుగా బ్రేక్ దర్శన సమయాన్ని మార్పు చేశాం. దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. బ్రేక్ తర్వాత రూ.300 దర్శన స్లాట్ మొదలవుతుంది.

21. చిరంజీవి – హోసూరు

ప్రశ్న : తిరుమలలో దర్శన సౌకర్యాలు మెరుగుపడ్డాయి. దళారులను అరికట్టండి.

ఈఓ : దళారులపై ప్రతిరోజు నిఘా ఉంచి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు 216 ఎఫ్ఐఆర్ లు, 14 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశాం.

22. రామకృష్ణ పరమహంస – హైదరాబాద్

ప్రశ్న : తిరుమలకు కాలినడకన వచ్చాము. భద్రతా చర్యలు సరిగా లేవు. సమాధానం చెప్పే అధికారులు కనిపించడం లేదు. ఇంకా కొన్ని వివరాలతో మెయిల్ పెట్టాను. పరిశీలించగలరు.

ఈఓ: నడక మార్గంలో ఉన్న సమస్యలను పరిశీలించి వాటిని పరిష్కరిస్తాం.

23. సరిత – హైదరాబాద్

ప్రశ్న : గతేడాది కల్యాణం చేయించాం. శ్రీవారి ఆలయంలో దర్శనం తర్వాత తిరిగి వచ్చేటప్పుడు తోపులాట ఎక్కువగా ఉంది.

ఈఓ : వెండి వాకిలి వద్ద ఇరుకుగా ఉండడంతో ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. తోపులాట లేకుండా తగిన చర్యలు తీసుకుంటాం.

24. రత్నం – కాకినాడ

ప్రశ్న : తిరుపతి శ్రీనివాసంలో దిగాము. స్నానపుగదుల వద్ద డబ్బులు అడుగుతున్నారు. ఇక్కడ తమిళ సాంప్రదాయంలో సాంబార్ అన్నం కాకుండా ఆంధ్ర సాంప్రదాయంలో భోజనాలు వడ్డించండి.

ఈఓ : టిటిడిలో ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. సిబ్బందికి ప్రతినెలా వేతనాలు అందజేస్తున్నాం. తిరుమలలో ప్రతిరోజు దాదాపు లక్ష మందికి అన్నప్రసాదాలు వడ్డిస్తున్నాము. భక్తుల నుంచి మంచి ఆదరణ ఉంది. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అన్నప్రసాదాలు అందిస్తున్నాము.

ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో   సదా భార్గవి, ఎస్వీబీసీ సీఈవో   షణ్ముఖ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

Tags:Yogadarshan Parayanam Available to Devotees – Dial Your Evo EV.Dharmareddy

Post Midle