బలిదానానికి సిద్ధపడతా : ఒంటేరు

You are ready for the sacrifice: Otturu

You are ready for the sacrifice: Otturu

Date:26/11/2018
మెదక్ ముచ్చట్లు:
కేసీఆర్‌ తనపై కుట్ర పన్నారని ఆరోపించారు గజ్వేల్ మహా కూటమి అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కక్షసాధింపుతో 27 కేసులుపెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు రావడంతో.. మళ్లీ వేధింపులు మొదలయ్యాయని.. గజ్వేల్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆత్మ బలిదానానికి సిద్దమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఎన్నికల అధికారుల్ని కలిసిన తర్వాత మాట్లాడిన ప్రతాప్ రెడ్డి.. కేసీఆర్, హరీష్‌రావులపై ఫైరయ్యారు. గజ్వేల్‌లో ప్రజలందర్నీ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ప్రతాప్ రెడ్డి. కేసీఆర్‌ను గెలిపించేందుకు ఇప్పటికే 50 కోట్లు ఖర్చు చేశారని.. సీఎం ఫాంహౌస్‌లో డబ్బులున్నాయని.. అక్కడ తనిఖీలు చేసి.. వేలకోట్ల రూపాయలను ఎందుకు సీజ్‌ చేయ్యట్లేదో చెప్పాలన్నారు. పైగా ప్రశ్నించిన తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తూ.. పోలీసుల్ని అడ్డు పెట్టుకుని వేధిస్తున్నారని మండిపడ్డారు. గజ్వేల్‌లో పోలీసులే స్వయంగా డబ్బులు, మందు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలను సీఈవో దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు.
మంత్రి హరీష్‌ రావు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులంటిని బయటపెడతానన్నారు వంటేరు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న హరీష్‌కు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలన్నారు. తనకున్న ఆస్తులన్నీ అమ్ముకున్నాని, చనిపోతే బొంద పెట్టడానికి కూడా సొంత జాగా లేదన్నారు. పోలీసులు, ఎన్నికల అధికారులు వేధిస్తున్నారని.. వారి తీరులో మార్పు రాకుంటే గజ్వేల్‌ ఆర్వో కార్యాలయం ముందు ఆత్మ బలిదానం చేసుకుంటానని హెచ్చరించారు. భ్రఘ్ట పట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి ప్రాణాలను లెక్కచేయనన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని టీఆర్‌ఎస్‌ నెరవేర్చలేదని ఆరోపించారు వంటేరు. 450 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే ఒక్కరిని కూడా కేసీఆర్ పరామర్శించలేదని.. ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయలేదన్నారు. మసాయిపేట రైలు ప్రమాద మృతులను, క్షతగాత్రులను పరామర్శించడానికి రాలేదన్నారు. మల్లన్న సాగర్ లో 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు. గజ్వేల్‌లో ఎవరూ ప్రచారం చేయొద్దని, ప్రజలు ఎవరికి ఓటేస్తారో చూద్దామన్నారు.
Tags:You are ready for the sacrifice: Otturu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *