ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే       కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్జే

You have to give special status to AP Senior Congress leader Mallikarjun Kharge

You have to give special status to AP Senior Congress leader Mallikarjun Kharge

Date:17/03/2018
న్యూఢిల్లీ   ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్జే అన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌పై ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడంపై మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. త్వరలో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.శనివారం కాంగ్రెస్ ప్లీనరీ సదస్సులో ఖర్గే మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (యోగి) కర్ణాటకలో ప్రసంగాలతో బిజీగా గడిపారని, ఫలితంగా యూపీలో జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైందనిని అన్నారు. అయితే కర్ణాటకలో కార్యకర్తలు, నేతల ఆశీస్సులు, సహకారంతో మనం మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని అన్నారు. పార్టీ ఎంతో చేసినా కార్యకర్తలందరి సహకారం కూడా చాలా అవసరమని అయన అన్నారు. పార్టీ కార్యకర్తలు, నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రచారం సాగించాలని సూచించారు. జాతి ప్రయోజనాల దృష్ట్యా విభేదాలన్నీ పక్కనపెట్టి పార్టీ కోసం కలిసి పనిచేయాలని ఖర్గే పిలుపునిచ్చారు.దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్యమే కారణమని ఖర్గే విమర్శించారు. దేశంలో ప్రతిరోజూ వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం, మోదీ చాలా వాగ్దానాలు చేశారు. కానీ బడ్జెట్‌లో కేటాయింపులు పరంగా చేసింది ఏమీ లేదు. మేము (యూపీఏ) అధికారంలో ఉన్నప్పుడు రైతు ఇబ్బందుల్లో ఉంటే వారిని వెంటనే ఆదుకునే వాళ్లం ని అన్నారు.
Tags:You have to give special status to AP
Senior Congress leader Mallikarjun Kharge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *