ప్రభోదానందస్వామిని ఆరెస్టు చేయాలి

You must first ask the Lord

You must first ask the Lord

 Date:21/09/2018
అనంతపురం ముచ్చట్లు:
తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామంలోని ప్రభోదానందస్వామిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పట్టణంలో ముస్లిం మైనార్టీలు శుక్రవారం మధ్యాహ్నం శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని బండా మసీదు నుండి దాదాపు 500 మంది దాకా ముస్లిం మైనార్టీలు సి.బి. రోడ్డు గుండా ర్యాలీ నిర్వహించి అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ లో సి.ఐ సురేంద్రరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రభోదానందస్వామి తాను రాసిన ‘దేవుని ముద్ర’ అనే పుస్తకంలో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి యావద్భారత దేశంలోని ముస్లింలందరి మనోభావాలను దెబ్బతీశాడన్నారు. ఇందుకు సంబంధించి ప్రభోదానందస్వామిపై చర్యలు తీసుకోవాలని తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ లో 16 మే 2017వ తేదీన ముస్లిం మైనార్టీలంతా కలసి అప్పటి డిఎస్పీ చిదానందరెడ్డి గారికి మరియు పట్టణ సి.ఐ భాస్కర్ రెడ్డి కి పిర్యాదు చేయడం జరిగిందన్నారు.
ఈ మేరకు తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రభోదానందస్వామిపై కేసు నమోదైయిందన్నారు. ఈ కేసు నమోదయి ఏడాది పూర్తయినప్పటికీ ఇంతవరకు ప్రభోదానందస్వామిని అరెస్టు చేయలేదని వారు నిరసన తెలిపారు. ఇప్పటికైనా ప్రభోదానందస్వామిపై వెంటనే అరెస్టు చేయని పక్షంలో ఒక్క తాడిపత్రిలోనే గాకుండా అన్ని పట్టణాల్లోనూ ముస్లింలందరినీ ఏకం చేసి దశల వారీగా ఆందోళన చేపడతామని స్పష్టం చేశారు.
దీంతో పట్టణ సి.ఐ సురేంద్రరెడ్డి సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే ప్రభోదానందస్వామిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఖాజీ అబ్దుల్ హైఖాద్రి, వక్స్ బోర్డు ప్రెసిడెంట్ మహమ్మద్ జాకీర్, మున్సిపల్ కో-ఆప్షన్ మెంబరు నియాజ్ బాష ముస్లిం మైనార్టీ నాయకులు అయూబ్ బాష, సలాంబాష నదీం, షబ్బీర్ బాష,ముస్తాక్ అహమ్మద్,కె.వి.రషీద్,షెక్షావలి,చాంద్ బాష,అమీర్,వలి బాష,జిలాన్ బాష,నూర్,బాదం సాబ్, ఇస్మాయిల్,మహమ్మద్ రఫి,నాజుబాష,సత్తార్,షానవాజ్,జబ్బార్,సలీం,ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.
Tags:You must first ask the Lord

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *