మళ్లీ మీరే ప్రధాని కావాలి
న్యూఢిల్లీ ముచ్చట్లు:
2024లో మళ్లీ ప్రధానిగా నరేంద్రమోదీనే రావాలని మధురై అధీనం ప్రధాన పూజారి శ్రీ హరిహర దేశి స్వామి అన్నారు. ఢిల్లీలో నూతన పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సెంగోల్ (రాజదండం)ను ప్రధానికి అందించనుంది ఈయనే కావడం విశేషం. ఈ సందర్భంగా హరిహర దేశి స్వామి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందిన నాయకుడని కొనియాడారు, ప్రపంచ నాయకులు మోదీని అభినందిస్తున్నందుకు మనమందరం చాలా గర్వపడాలని చెప్పుకొచ్చారు. మోదీ దేశ ప్రజలకు ఎంతో మంచి చేస్తున్నారన్న హరిహర దేశి.. 2024లో మళ్లీ మోదీ ప్రధాని అయ్యి దేశ ప్రజలకు మార్గదర్శిగా నిలవాలని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉంటే కొత్త పార్లమెంట్ భవనంలో స్పీకర్ కుర్చీకి సమీపంలో ప్రధాని మోదీ ఈ చారిత్రక రాజదండం (సెంగోల్)ను ఏర్పాటు చేయనున్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ సెంగోల్‌ను బ్రిటీషర్ల నుంచి భారతదేశానికి అధికారిక మార్పిడికి గుర్తుగా.. భారతదేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూకు బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ అప్పగించారు. ఈ రాజదండాన్ని సెంగోల్ అని పిలుస్తారని.. ఇది తమిళ పదం అయినా సెమ్మాయ్ (ధర్మం) నుంచి వచ్చింది. కొత్త పార్లమెంట్‌లో ప్రస్తుతం ఈ రాజదండం ఏర్పాటు వల్ల.. మన సంప్రదాయాలను ఆధునికతను సంధానించే ప్రయత్నం జరుగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు.

ఇలా చేయాలనడం మోడీ దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. ఈ రాజ దండం ప్రస్తుతం అలహాబాద్ లోని మ్యూజియంలో ఉంది. మే 28న పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో దీనిని పార్లమెంట్ భవనంలో అమర్చనున్నారు.ఇదిలా ఉంటే పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ.. ‘రాజదండం’ చర్చనీయాంశమైంది. రాజదండం.. బ్రిటిషర్ల నుంచి భారత్‌కు బదిలీ అయిన అధికారాలకు ఈ రాజదండం ప్రతీక అని కేంద్రం చెప్తుండగా.. అందుకు లిఖితపూర్వకమైన ఆధారాలు లేవని కాంగ్రెస్ వాదిస్తోంది. దీంతో కాంగ్రెస్‌పై పలువరు మండి పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా తిరువావడుతురై అధీనం కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలను ఖండిస్తూ అధికారికంగా లేఖ విడుదల చేసింది. ఇందులో వారు పేర్కొన్న అంశాలివే.
Tags: You need to be prime minister again
