మలేషియా  లో టైటిల్ సాంగ్ చిత్రీకరించిన నిన్నే చూస్తు 

. Date:20/03/2018
హైదరాబాద్‌ ముచ్చట్లు:
వీరభద్ర క్రియేషన్స్ పతాకం పై నూతన నటీనటులు శ్రీకాంత్, నితిన్  మరియు హేమ‌ల‌త (బుజ్జి) హీరో హీరోయిన్ గా నాటితరం హీరోయిన్ సుహాసిని మరియు సుమన్, భాను చందర్  ముఖ్య పాత్రలలో కె.గోవ‌ర్ధ‌న్‌రావు దర్శకత్వం లో హేమ‌ల‌తా రెడ్డి నిర్మాత‌గా నిర్మిస్తున్న చిత్రం  నిన్నే చూస్తు . ఇటీవల రెండు షెడ్యూలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు సరవేగంగా మూడో షెడ్యూల్ లో బిజీ గా ఉంది.
ఇటీవలే ‘నిన్నే చూస్తు’ అనే  శ్రావ్యమైన పాటను మలేషియా లోని అందమైన లొకేషన్స్ లో  చిత్రీకరించారు. పాట చిత్రీకరణ పూర్తియింది. చిత్ర యూనిట్ సభ్యులంతా పాట అవుట్ ఫుట్ చూసి చాల సంతోషించారు. ఈ టైటిల్ సాంగ్ ఈ చిత్రానికే ఒక హైలైట్ గా నిలుస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత  హేమ‌ల‌తా రెడ్డి మాట్లాడుతూ “ఇప్పటివరకు రెండు షెడ్యూలు పూర్తిచేసుకున్నాము. ఈ చిత్రానికి టైటిల్ సాంగ్ ఒక ప్రత్యేకం. సంగీత దర్శకుడు రమణ్ రాథోడ్ అద్భుతమైన పాటలను అందించాడు. ఈ టైటిల్ సాంగ్ ‘నిన్నే చూస్తు’ చాల శ్రావ్యం గా ఉంటుంది. ఇలాంటి అందమైన పాట కు మలేషియా లోని అందమైన లొకేషన్స్ లు ఊపిరి పోశాయి. పాట అద్భుతంగా వచ్చింది. నృత్య దర్శకురాలు రేఖ అందించిన కొరియోగ్రఫీ మరో హైలైట్. మా వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్ లో ‘నిన్నే చూస్తు’ రెండొవ చిత్రం. మంచి కుటుంబకథ చిత్రం. సీనియర్ నటులు సుహాసిని గారు, సుమన్ గారు మరియు భాను చందర్ గారు ముఖ్య పత్రాలు చేస్తున్నారు. మా చిత్రం లో సుహాసిని గారు  సుమన్ గారు నటించటం మా అదృష్టం. వారు నటించిన సన్నివేశాలు చాల బాగా వచ్చాయి. త్వరలోనే  చిత్రం షూటింగ్ పూర్తిఅవుతుంది ” అని అన్నారు నితిన్ (రెండో హీరో ),  భాను చందర్, సుమన్ , సన , కాశీ విశ్వనాధ్ , సాయాజీ షిండే ,  రజిత , విద్య లతా , నిహాల్ , వేణు , మహేష్ , ఫణి , రమణ్ , వెన్నెల కిశోర్ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె గోవర్ధన్ రావు, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్ ), సెకండ్ కెమెరా మాన్ శంకర్ , ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్.
Tags:You see yourself in the title of the title song in Malaysia

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *