బైకు అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలు

Young man has severe injuries

Young man has severe injuries

Date:26/11/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని బసవరాజు కండ్రిగ గ్రామానికి చెందిన హరి అనే యువకుడు తన సొంత పనులకోసం బసవరాజకండ్రిగ గ్రామం నుంచి బైకుపై  పలమనేరుకు బయలుదేరాడు. కల్లుపల్లి గ్రామా సమీపంలోని ఏరు వద్దకు రాగానే బైకు అదుపు తప్పి బోల్తా పడడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో హరి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అందించిన సమాచారంతో 108 సిబ్బంది కిషోర్, అమ్ములు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ హరికి ప్రథమ చికిత్స చేసి 108 అంబులెన్సులో  పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో క్షతగాత్రున్ని వేలూరు సీఎంసీ కి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

అభివృద్ధి పనులు సత్వరం పూర్తి చేయాలి

Tags:Young man has severe injuries

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *