రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

బంధువుల అందోళన
నిర్మల్ ముచ్చట్లు:
నిర్మల్ జిల్లా తానుర్ మండలం బోండ్రెడ్ x రోడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో  బోసి గ్రామానికి చెందిన మాధవ్ అనే యువకుడు బుధవారం మృతి చెందాడు…అయితే ఇది రోడ్డు ప్రమాదం కాదని పథకం ప్రకారమే హత్య చేశారంటూ ఆరోపిస్తూ 61 వ జాతీయ రహదారిపై రాస్తా రోకో చేపట్టారు బంధువులు. దింతో ఇరు వైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి . దాంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది..
బోసి గ్రామానికి చెందిన మాధవ్ అనే యువకుడు భైంసా లోని ఓ తాపీ మెస్ట్రీ వద్ద    దినసరి కూలీగా పని చేయగా సదరు మెస్ట్రీ వద్ద మాధవ్ అప్పుగా కొంత డబ్బులు తీసుకున్నాడు…ఈ డబ్బుల విషయం పై నిన్న ప్రొద్దున మాధవ్ మెస్ర్తి వద్ద వాదోపవాదాలు జరిగాయని గ్రామస్తులు చెబుతున్నారు… ఈ విషయమై భైంసా లో మాట్లాడు కుందామని మాధవ ను మెస్ర్తి తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందా లేక హత్య జరిగిందా అనుమానాలు వ్యక్తం చేశారు… కానీ గ్రామస్టులు మాత్రం మెస్ర్తి హత్య చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఏకమై జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు… సుమారు 3 గంటల పాటు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది…అటు పోలీసులకు ఆందోళన కారులు మధ్య వాగ్వాదం జరిగింది… వెంటనే ఆ మెస్ట్రీ ని అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు.. చివరకు ఆందోళన కారులను సందాయించి న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో ఆందోళన విరమించారు..

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

 

Tags:Young man killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *