Natyam ad

పుంగనూరు రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు

పుంగనూరు ముచ్చట్లు:
 

పట్టణ సమీపంలోని శుభారాం డి గ్రీ కళాశాల వద్ద ద్విచక్రవాహనాన్ని ఆటో ఢీకొనడంతో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని జెట్టిగుండ్లపల్లెకు చెందిన వెంకట్రమణ కుమారుడు రమేష్‌ ద్విచక్రవాహనంపై వస్తుండగా పుంగనూరు నుంచి రామసముద్రం వెళ్తున్న ఆటో ఏపి03టిఏ 1369 అతివేగ ంగా ఎదురుగా వస్తున్న రమేష్‌ వాహనాన్ని ఢికొంది. ఈ ప్రమాదంలో రమేష్‌ కుడికాలు విరిగి తీవ్ర రక్తగాయాలైంది. వెంటనే ఆ ప్రాంత వాసులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Young man seriously injured in Punganur road accident

Leave A Reply

Your email address will not be published.