రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ప్రాముఖ్యతను యువత తెలుసుకోవాలి

–  జిల్లా జడ్జి గన్నారపు సుదర్శన్

Date:25/01/2021

జగిత్యాల  ముచ్చట్లు:

భారత రాజ్యాంగం కల్పించిన ఓటు ప్రాముఖ్యతను యువత తెలసుకోవడంతో పాటు హక్కును గురించిన అవగాహనను ఇతరులకు కల్పించాలని జిల్లా జడ్జి గన్నారపు సుదర్సన్ అన్నారు.   సోమవారం జిల్లా కేంద్రంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌరస్తా, కొత్తబస్టాండ్ వద్ద నిర్వహించిన జాతీయ ఓటరు అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ జిల్లా జడ్జి మాట్లాడుతూ,  జిల్లాలో 8679 మంది కొత్త ఓటరుగా నమోదు జరిగితే అందులో 4540 మంది మహిళా ఓటర్ల సంఖ్య  ఎక్కవగా ఉన్నదని పేర్కోన్నారు.   భారతప్రభుత్వం కల్పించిన ఓటు హక్కు బాష, కులం, మతానికి అతీతంగా ఓటు హక్కును వినియోగించుకునే హక్కును భారత ప్రభుత్వం కల్పించిందని పేర్కోన్నారు.  అన్ని ధర్మాలలో ఓటుహక్కును వినియోగించుకొవాలి అనే ధర్మానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు.  ఓటు హక్కును  ఎటువంటి  ప్రలోబాలకు, బయానికి లోంగిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉన్నదని అన్నారు.  ఓటు హక్కును 23 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగిందని, యువత ఓక్కుహక్కు ప్రాముఖ్యతను తెలుసుకోవడంతో పాటు, ఇతరులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని పేర్కోన్నారు.

 

 

జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదిన జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని. ఓటరు దినోత్సవ కార్యక్రమంలో బాగంగా ప్రతి సంవత్సరం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడంలో బాగంగా 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరుగా గుర్తించడం,  మరణించిన లేదా బదిలి అయిన వారి వివరాలను డోర్ టూ డోర్ సర్వేద్వారా సవరించడం జరుగుతుందని తెలియజేశారు.  జిల్లాలో కొత్తగా 4135 మంది పురుష, 4540 మహిళా ఓటర్లను గుర్తించడం జరిగిందని పేర్కోన్నారు.  కార్యక్రమంలో బాగంగా ఉత్తమ సేవలందించిన బూత్ లెవెల్ అధికారులకు సీనియర్ సిటిజన్స్ ను గుర్తించి సత్కరించారు, అనంతరం ఓటు ప్రతిజ్ఞ ప్రమాణాన్ని చేయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బి. రాజేషం, స్థానిక సంస్థల అధనపు  కలెక్టర్ అరుణశ్రీ,జిల్లా అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గోన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Young people need to know the importance of the right to vote enshrined in the Constitution

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *