రోడ్డుప్రమాదంలో యువతి మృతి
ఖమ్మం ముచ్చట్లు:
శ్రీశ్రీ సర్కిల్ లో స్కూటీ ని, టేకులపల్లి బ్రిడ్జ్ దగ్గర కారును, బైకును లారీ ఢీ కొట్టింది. వైరా లో హెచ్.పి గ్యాస్ లో పనిచేస్తున్న శ్రీకన్య (30) నునావత్ రాణి (28) ఆఫీస్ కి తమ స్కూటీ మీద వెళుతుండగా శ్రీశ్రీ సర్కిల్ దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ అతి వేగంగా వచ్చి ఢీకొట్టడంతో శ్రీ కన్య అక్కడికక్కడే మృతి చెందింది. వీరిని ఢీ కొట్టిన లారీ అదే వేగంతో వెళ్లి టేకులపల్లి బ్రిడ్జి దగ్గర ఒక కారును ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన రాణిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన శ్రీ కన్య ది మరిపెడ బంగ్లా కాగా తీవ్ర గాయాలైన రాణి ది గుర్రాలపాడు తండా.మృతి చెందిన శ్రీ కన్యను అన్నం ఫౌండేషన్ అన్నం శ్రీనివాసరావు బృందం ప్రభుత్వాసుపత్రి మార్చురీ కి తరలించారు. డ్రైవర్ లారీని వదిలేసి పారిపోయాడు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Young woman died in a road accident

