పలమనేరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండలం గడ్డూరు గ్రామానికి చెందిన లోకేష్ కుమార్తె కన్మణి అనే బాలిక ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయిందని కుటుంబీకులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడంతో పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెంది ఉందని కుటుంబీకులకు తెలిపారు. గొంతు కింద నల్లగా కమిలి ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలిది సహజ మరణమా లేదా ఉరి వేసుకుందా మరి ఇంకేదైనా కారణము ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
Tags; Young woman died in suspicious condition