యువతి హల్ చల్

నల్గొండ ముచ్చట్లు:

నల్గొండ జిల్లా నార్కట్ పల్లి ఆర్టీసీ బస్ డిపోలో యువతి హాల్చర్ చేసింది. చేయి కోసుకుని ఎత్తైన చెట్టెకింది.కొద్దిసేపు దూకుతానంటూ బెదిరించింది. సుమారు 3 గంటల దాకా నానా హంగామా చేసింది. ఎట్టకేలకు చెట్టు నుంచి దింపి పోలీసులకు అప్పగించారు స్థానికులు. కాగా యువతికి మతి స్థిమితం లేదని పోలీసులు నిర్దారించారు. యువతి హైద్రాబాద్ ఎల్బీ నగర్ కుచెందిన 17 ఏళ్ల హరికగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.యువతి తండ్రి హైకోర్టు అడ్వకెట్ సుందర్ రావు అని సమాచారం.యువతి ఎల్బీనగర్ లో బస్సెక్కి నార్కట్ పల్లిలో బస్సు దిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

 

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Young woman hull hull

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *