యువతిపై అన్న కొడుకు దాడి

చిత్తూరుముచ్చట్లు:

వ్యవసాయ పొలం దగ్గరికి వచ్చిందని అకారణంగా యువతిపై అన్న కొడుకు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.శనివారము 5 సాయంత్రము గంటల ప్రాంతంలో చిత్తూరు నియోజకవర్గ గుడిపాల మండలంలో చిత్తపార గ్రామంలో నివాసముంటున్న నందిని (18) పనిగా వ్యవసాయ పొలం వద్దకు వెళుతూ ఉండగా ఆ యువతి అన్న కొడుకు విజ్జి పొలం వద్దకు ఎందుకు వచ్చావని దూషిస్తూ అతి కిరాతకంగా ఆమెపై దాడి చేశాడు.దాడిలో తీవ్రంగా గాయపడిన నందినికి తండ్రి లేకపోవడం, తల్లి బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న మానసిక వికలాంగురాలు కావడంతో గ్రామస్తులు మానవత్వంతో నందిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.గుడిపాల పోలీసులకు ఫిర్యాదు చేశారు.సెక్షన్ పోలీసులు స్పందించి విజిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

Tags: Young woman was attacked by her elder son

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *