విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు- రవీంద్రనాథ్ ఠాగూర్

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

నేనిక లేనని తెలిశాక విషాదాశ్రులను
వర్షిస్తాయి నీ కళ్ళు..
కానీ నేస్తం అది నా కంట పడదు!
ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా!

నీవు పంపించే పుష్పగుచ్ఛాలను
నా పార్ధివదేహం
ఎలా చూడ గలదు?
అందుకే… అవేవో ఇప్పుడే పంప రాదా!

నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావ్
కానీ అవి నా చెవిన పడవు..
అందుకే ఆ మెచ్చేదేదో ఇపుడే మెచ్చుకో !

నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు !
కానీ నాకా సంగతి తెలీదు..
అదేదో ఇపుడే క్షమించేస్తే పోలా?!

నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది
కానీ అది నాకెలా తెలుస్తుంది?
అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !

నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది
అదేదో ఇప్పుడే గడపరాదూ!

సానుభూతి తెలపడానికి నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. నా మరణ వార్త విన్నాక!
సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?

ఇప్పుడే నావైపు చూడు,
నాతో మాట్లాడు, బదులు పలుకు వస్తుంది!

 

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి మందలించడంతో మీటింగ్‌ల్లో నేతలు

Tags: Your eyes rain down sadness – Rabindranath Tagore

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *