Your protection is our responsibility

Your protection is our responsibility

– అత్యవసర సమయంలో ఎప్పుడైనా, ఎలాంటి సమస్యైనా డయల్ 100 కు సమాచారం అందించండి.
– తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి డా.  గజరావు భూపాల్

Date:02/12/2019

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి అర్బన్ జిల్లా పోలీసుల డయల్ 100 ను ప్రజలు విరివిగా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని పోలీస్ వారి మనవి. ఇది రాత్రింబవళ్ళు అందుబాటులో ఉంటుంది. ఫోన్ కాల్ అందుకున్న వెంటనే సంబంధిత పోలీసులకు సమాచారాన్ని పంపించి తక్షణమే సహాయం అందుతుంది. అలాగే డయల్ 100 కాల్స్ స్పందన పట్టణ ప్రాంతంలో సగటున 6 నిమిషములుగా నమోదయింది. దీనికి తోడు తిరుపతి అర్బన్ పోలీసుల పరిదిలో దాదాపు 800 వందల సి.సి కెమరాలు ఏర్పాటు చేయబడి వీటిని పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసందానించడంవలన కంట్రోల్ రూమ్ లోని సిబ్బంది వీటి ద్వారా నగరాన్ని మరియు చుట్టుపక్కల ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు వైర్లెస్ సెట్ ద్వారా సిబ్బందికి తెలియజేయడం జరుగుతుంది. తిరుపతి పోలీస్ కంట్రోల్ రూమ్ కు ప్రతి రోజు సగటున 130 డయల్ 100 కాల్స్ వస్తాయి, ఇందులో 22 అత్యవసర కాల్స్ నమోదుకాబడుచున్నాయి. ఇటువంటి అత్యవసర కాల్స్ ను నిర్ణిత సమయంలో నేరాలను అదుపుచేసి భాదితులకు సహాయం అందించడం జరుగుతుంది. తిరుపతి అర్బన్ జిల్లా వ్యాప్తంగా 13 బ్లూ కోల్ట్స్, 09 రక్షక్ లు, 04 ప్రత్యేకంగా మహిళల కొరకై ఏర్పరిచిన మహిళా రక్షక వాహనాలతోపాటు జాతీయ రహదారి మీద నిరంతరం నిఘా మరియు అత్యవసర సహాయం అందించడానికి 06 రోడ్ సేఫ్టీ మొబైల్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కనుక తిరుపతి అర్బన్ జిల్లాలోని ప్రజలు అప్రమత్తంగా వుంటూ ఏదైనా చిన్న అనుమానం వచ్చినా డయల్ 100 కు ఫోన్ చేసి అర్బన్ జిల్లా పోలీసుల సేవలు ఉపయోగించుకోవాలని జిల్లా యస్.పి డా,, గజరావు భూపాల్ ఐ.పి.యస్ కోరడమైనది.

 

మాతృ వందన వారోత్సవాలు

 

Tags:Your protection is our responsibility

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *