వీఆర్వోలకు ఆదాయ వనరుగా మీ సేవా కేంద్రాలు

Your service centers are a source of income for VVV

Your service centers are a source of income for VVV

Date:11/10/2018
గుంటూరు  ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌లోని సేద్యపు భూములన్నీ ఆన్‌లైన్‌ చేయాలని ప్రభుత్వ నిబంధన విఆర్‌ఒల చేతవాటానికి ఊతంగా మారాయి. పల్నాడు ప్రాంతంలో భూములు సేద్యం చేసే రైతాంగం ఎక్కువ శాతం నిరక్ష్యరాస్యులు కావడంతో విఆర్‌ఒలు దానిని ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తోన్నాయి. ఐదేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని భూములన్నీ ఇంటింటికి తిరిగి సేద్యం చేసేవారి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆసమయంలో విఆర్‌ఒలు ఆయా గ్రామాల్లో ఉన్న తమ ఏజెంట్లు తెచ్చిన వివరాలు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. తూతూమంత్రంగా ఆసర్వేను పూర్తి చేసి అటకెక్కించారు.
దాంతో పల్నాడులోని రైతాంగం ఆన్‌లైన్‌ ఉచ్చులో ఇరుక్కుపోయారు. ప్రస్తుతం వ్యవసాయ రుణాలు తీసుకోవాలంటే ఆన్‌లైన్‌లో అడంగల్‌, 1బిలు కావాలని చెప్పడంతో విఆర్‌ఒల చుట్టూ ప్రదక్షణలు చేసి కొంతమందిని నయానో భయానో ఆన్‌లైన్‌ సమస్య పరిష్కరించుకున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌, సర్వే చేయించడం కష్టతరమైంది. నెలల తరబడి సర్వేయర్‌ చుట్టూ చలానా కట్టి తిరిగినా ఫలితం శూన్యం. ఒక రైతుతో పలుమార్లు చలానాలు కట్టించి వారికి దయ కలిగినప్పుడే ముడుపులు తీసుకుని మరీ సర్వే పూర్తి చేస్తున్నారు.విఆర్‌ఒల కనుసన్నల్లో కారంపూడి మీసేవా కేంద్రాలు పని చేస్తున్నాయని గ్రామస్తులు పలువురు చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లో తన భూమి ఆరైతుకు తెలి యకుండానే మాయమవుతున్న ఘటనలు కారంపూడిలో వెలుగు చూస్తున్నాయి. ఇంతజరుగుతున్నా మీసేవా కేంద్రాలు, జిల్లా అధికారులు సుమారు కొంతకాలంగా కారంపూడి మీసేవా కేంద్రాలను తనిఖీ చేసిన దాఖలాలు లేవు. రెవెన్యూ అధికారులు, మీసేవా జిల్లా అధికారులు, కారంపూడిలోని మీసేవా కేంద్రాలను ఎవరు నిర్వహిస్తున్నారో తనిఖీ చేయడంలేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు కారంపూడిలో జరుగుతున్న రెవెన్యూ భాగోతాన్ని బట్టబయలు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Tags:Your service centers are a source of income for VVV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *