మీ చేతుల్లో మీసేవ 

Date:22/05/2019

వరంగల్ ముచ్చట్లు:

 

 

 

 

మీ సేవ కేంద్రానికి వెళ్లి గంటల తరబడి సర్వీసుల కోసం వేచి చూసే విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. రోజురోజుకు సాంకేతికత పెరుగుతుండడంతో మీ సేవ కేంద్రాల్లో సేవలను వేగవంతం చేసేందుకు తెలంగాణ ఐటీ శాఖ 2.0 వర్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఏదైనా ధ్రువీకరణపత్రం అవసమైతే ప్రజలు గ్రామాల నుంచి మండల కేంద్రాలకు, పట్టణాల్లోని మీసేవ కేంద్రాలకు వెళ్లేవారు. అక్కడ గంటల తరబడి నిల్చునేవారు. నిర్వాహకులు అధికంగా డబ్బులు వసూలు చేసేవారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం కొత్తగా 2.0 వర్షన్‌ ద్వారా సామాన్యులకు మీసేవ దరఖాస్తులను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్లు, డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌ల ద్వారా ఎవరికి వారే వివిధ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించారు.మీ స్మార్ట్‌ఫోన్‌లో లేదా కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌ సర్వీస్‌ ద్వారా మీసేవ 2.0 వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో కేఐవోఎస్‌కేలోకి వెళ్లాలి. అందులో మూడు రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయి. సిటిజన్‌ సర్వీస్‌లోకి వెళ్లాలి. తర్వాత యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ క్రియేట్‌ చేసుకోవాలి. తర్వాత పేరు, చిరునామా, ఆధార్‌ నంబరు, ఫోన్‌ నంబరు, ఈమెయిల్‌ అడ్రస్‌ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. తర్వాత  ఓటీపీ వస్తుంది. దాని తర్వాత హోం పేజీ వస్తుంది. అనంతరం లాగిన్‌ కావాలి. దీంతో 37 రకాల సేవలు పొందవచ్చు.

 

 

 

 

 

 

 

మున్ముందు మరిన్ని సేవలు వచ్చే అవకాశం ఉంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం టీ-ఫోలియో యాప్‌ ద్వారా పలు సేవలను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో కొన్ని ఇబ్బందులు రావడంతో తాజాగా 1.0 సాఫ్ట్‌వేర్‌ నుంచి 2.0 వర్షన్‌కు అప్‌గ్రేడ్‌ చేశారు. ప్రస్తుతం దీని ద్వారా 37 రకాల ప్రభుత్వ పౌర సేవలు ఇంటి వద్ద నుంచే పొందేందుకు వీలు కల్పించింది. ఇంటి నుంచే దరఖాస్తు చేసుకున్న తర్వాత సంబంధిత అధికారులు ధ్రువపత్రాలను జారీ చేస్తారు. ఎస్‌ఎంఎస్‌ ద్వారా చరవాణికి ఈ సమచారం అందుతుంది. వెంటనే వినియోగదారుడు మీసేవ కేంద్రానికి వెళ్లి ఆ ధ్రువపత్రాన్ని పొందవచ్చు. దీనిద్వారా ఆహారభద్రత, ఆదాయం, కులం, నివాసం, భూములకు సంబంధించిన ఆర్‌వోఆర్‌, పహణీ తదితర ధ్రువపత్రాలతోపాటు 37 రకాల పౌర సేవలను పొందవచ్చు. ఈ సేవలకుగాను చెల్లించే రుసుం ఆన్‌లైన్‌ ఖాతా నుంచే చెల్లించవచ్చు.

 

వాటా మాటేమిటి..? 

 

Tags: Your service in your hands

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *