తీవ్ర రూపం దాలుస్తున్న మీ టూ ఉద్యమం

Date:12/10/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
మహిళల ఆర్తనాదాలు మిన్నంటుతున్నాయి. తమ జీవితగమనంలో చవిచూసిన లైంగిక వేధింపులను ‘మీ..టూ’అంటూ ధైర్యంగా బహిర్గతం చేస్తున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ నటుల అసలు రంగును బయటపెట్టిన అతివలు ఇతర రంగాల్లోనూ తమకు ఎదురైన లైంగిక వేధింపులను బట్టబయలు చేస్తున్నారు. తాజాగా సుప్రసిద్ధ పాత్రికేయుడు, కేంద్ర మంత్రి ఎంజే అక్బర్‌పైనా బాలీవుడ్ నటుడు అలోక్‌నాథ్‌పైనా ఈ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దృష్టికి తీసుకురాగా ఆమె మౌనంగానే ఉండిపోయారు.
‘ఎంజే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహిళా మంత్రిగా మీ జూనియర్ మంత్రిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరిపిస్తారా?’అని సుష్మాను విలేఖరులు ప్రశ్నించారు.
విలేఖరుల ప్రశ్నను మంత్రి విన్నారే తప్ప ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇక లైంగిక వేధింపుల బారిన పడ్డ మహిళల జాబితా పెరిగిపోతోంది. మీ..టూకు మద్దతూ రోజురోజుకూ పెరుగుతోంది. బాధిత మహిళా జర్నలిస్టులకు ఎడిటర్స్ గిల్డ్ మద్దతుగా నివలడం ఊహించని పరిణామంగా చెప్పవచ్చు. మరో దిగ్భ్రాంతికరమై అంశం ఏమిటంటే ప్రముఖ నిర్మాత, రచయిత్రి వినీతానంద తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించారు. సినీరంగంలో పెద్దమనిషిగా చెలామణి అయిపోతున్న నటుడు అలోక్‌నాథ్ తనపై లైంగిక దాడికి తెగబడ్డాడని నంద తెలిపారు.
19 ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణంపై ఆమె గళమెత్తారు. వినీతాకు సినీ, టీవీ కళాకారుల సంఘం బాసటగా నిలిచింది. అలోక్‌కు షోకాజ్ నోటీసు పంపుతామని సినీ,టీవీ ఆర్టిస్టుల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుశాంత్ సింగ్ వెల్లడించారు. ఈమేరకు నందాకు సింగ్ లేఖ రాశారు. వినీతానంద టీవీషో ‘తార’తో ప్రేక్షకులకు సుపరిచితురాలు. తనపై జరిగిన లైంగిక దాడిని సోమవారం రాత్రి ఆమె ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. 2008లో నటుడు నానాపటేకర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి తనుశ్రీదత్తా ఆరోపణలు చేసిన తరువాత వివిధ రంగాలకు చెందిన మహిళలు బయటకు వచ్చి బాధలు చెప్పుకొంటున్నారు.
Tags:Your Too Movement is being bumped up

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *