Youth dies after falling from a coconut tree

కొబ్బరి చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి

Date:25/05/2020

పుంగనూరు ముచ్చట్లు:

ఇంటి వద్ద గల కొబ్బరి చెట్టులో కాయలు కోసేందుకు వెళ్లి కాలుజారి క్రింద పడి మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని యల్లారుబైలు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటరెడ్డి కుమారుడు నారాయణరెడ్డి(21) డ్రైవర్‌ పని చేస్తున్నాడు. ఇలా ఉండగా ఉదయం 8 గంటలకు ఇంటి వద్ద గల కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కొస్తుండగా ప్రమాదవశాత్తు జారి క్రిందపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే నారాయణరెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనతో యల్లారుబైలు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి, శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడు ఆత్మహత్య

Tags: Youth dies after falling from a coconut tree

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *