పుంగనూరులో యువత ఓటు విలువను తెలుసుకోవాలి – కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Date:25/01/2021

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజాస్వామ్యదేశంలో యువతి, యువకులు ముఖ్యంగా ఓటు విలువలు, హక్కులను సద్వినియోగ పరచాలని కమిషనర్‌ కెఎల్‌.వర్మ సూచించారు. సోమవారం కమిషనర్‌ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని తహశీల్ధార్‌ వెంకట్రాయులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కొండవీటి నాగభూషణంతో కలసి ఆయన నిర్వహించారు. అలాగే శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటర్ల దినోత్సవాన్ని ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదై, ఓటు హక్కును కాపాడాలని ప్రభుత్వం ఇచ్చిన సందేశాన్ని చదివి, ప్రమాణం చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటరుగా నమోదు కావాలని, నీతినిజాయితీగా ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రలోభాలకు ఓటర్లు లోనుకాకుండ తమకు నచ్చిన వారికి ఓటు వేసుకునే హక్కు ప్రజాస్వామ్యం కల్పించిందని, అదే హక్కులను బాధ్యతగా నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌   త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

Tags: Youth in Punganur need to know the value of vote – Commissioner KL Verma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *