Youth killed in road accident

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Date:14/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

ద్విచక్రవాహనం అదుపుతప్పి యువకుడు మృతి చెందగా మరో వ్యక్తి గాయపడిన సంఘటన పట్టణ సమీపంలోని పటాలమ్మ గుడి వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగింది. మంగళవారం ఎస్‌ఐ రవికుమార్‌ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం ఊలపాడుకు చెందిన మునెప్ప కుమారుడు సతీష్‌కుమార్‌(19) , అదే గ్రామానికి చెందిన కృష్ణప్ప కలసి ద్విచక్రవాహనంలో పుంగనూరులో సినిమా చూసుకుని వెళ్తుండగా పటాలమ్మ గుడి వద్ద వాహనం అదుపుతప్పి పడిపోయారు. ఈ ప్రమాదాన్ని ఎవరు గుర్తించకపోవడంతో ఉదయం వరకు సమాచారం ఎవరికి తెలియరాలేదు. ఈ ప్రమాదంలో సతీష్‌కుమార్‌ అక్కడిక్కడే మృతి చెందగా కృష్ణప్ప తీవ్ర గాయాలై పుంగనూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి , శవాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ముస్లింలను అణచివేసేందుకు బిజెపి చట్టాలు చేస్తే చూస్తూ ఊరుకోం..

Tags: Youth killed in road accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *