యువత సమాజసేవ లో భాగస్వాములు కావాలి

Youth need partners in community service

Youth need partners in community service

Date:10/12/2019

పీలేరు ముచ్చట్లు:

నియోజకవర్గంలోని కలికిరి మండలంలో ఆర్ ఎన్ ఆర్ ఫంక్షన్ హాల్ లో యువత సమాజ సేవ చైతన్య సదస్సును ఎన్ ఎస్ ఎఫ్ రాయలసీమ జోన్ అధ్యక్షులు మాలతోటి నరేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మదనపల్లి డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్ వో డాక్టర్ లోకవర్ధన్ , కలికిరి ఎస్ఐ రామాంజనేయులు, డిప్యూటీ తహశీల్దార్ జైసింహ , ఎన్ ఎస్ ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు నీరు గుట్టు నగేష్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా యువత సమాజం పట్ల బాధ్యతగా మెలగాలని సమాజం మనకేమిచ్చింది దానికన్నా సమాజానికి మనమేం ఇచ్చామని ఆలోచన యువతీయువకుల్లో రావాలని తెలియజేశారు అదే విధంగా విద్య వైద్య ఆరోగ్య వాణిజ్య రంగాల్లో ఒక యువకుడు ముందుకు దూసుకుపోవాలని కోరారు. యువత ప్రపంచంలోనే యువ శక్తి గల దేశం మన భారత దేశం అని దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని కాబట్టి యువత సమాజసేవ పట్ల అవగాహన పెంచుకొని సమాజంలో ఎలాంటి విపత్కర సంఘటనలు జరిగిన బాధ్యతతో యువత ముందడుగు వేయాలని ప్రపంచ విప్లవ వీరుడు చేగువేరా ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. సమాజంలో రోజుకు ఒక చోట అసాంఘిక ఘటనలో ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతున్న సంఘటనలు బాధాకరమని వాటిని అరికట్టవచ్చు నా బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందని గుర్తు చేశారు . ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, ఎన్ ఎస్ ఎఫ్ రాయలసీమ నాయకులు సురేష్ , విద్యార్థి విభాగం అధ్యక్షులు ఇంద్రసేన , వెంకీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

 

రైలులో గర్భిణికి పురిటినొప్పులు

 

Tags:Youth need partners in community service

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *