యువత ఓట్లే టార్గెట్ గా నిరుద్యోగ భృతి

Youth unemployed as Ottley Target
Date:17/09/2018
గుంటూరు ముచ్చట్లు :
ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం యువతను ఆకర్షించేందుకు యువనేస్తం పథకాన్ని ప్రవేశపెట్టింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని రాబోయే ఎన్నికల సందర్బంగా నెరవేర్చేందుకు బాబు సన్నాహాలు చేశారు. ఈ నూతన పథకం ద్వారా యువత అంతా టీడీపీవైపు మొగ్గు చూపుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దీనికితోడు ఈ పథకంపై పలు అనుమానాలు కూడా ముసురుకుంటున్నాయి.
పథకంలో పేర్కొన్న ప్రయోజనాలు ప్రతీ నిరుద్యోగికీ అందుతాయా అనేది పెద్ద ప్రశ్నగానే మిగిలింది. ఉపాధి శిక్షణతో పాటు ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో కొన్ని రాష్ట్రాలు నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేసినప్పటికీ ఆదిలోనే కష్టాలను ఎదుర్కొన్నాయి. చివరకి 20వేల మందికి మించి అందించలేమని ఆ ప్రభుత్వాలు చేతులెత్తేసిన ఉదంతాలున్నాయి.
కాగా ఈ పథకం సమర్ధవంతంగా అమలుచేయలేక పోవటానికి సమాచార, సమన్వయ లోపాలే కారణాలుగా ఆయా ప్రభుత్వాలు గుర్తించినట్టు సమాచారం. వీటిని పరిశీలించి అధ్యయనం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టంగా అమలుచేసేందుకు కార్యాచరణ రూపొందించినట్టు ప్రకటించింది. ఈ నేపధ్యంలోలక్షల మందికి యువనేస్తం పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో ఆన్లైన్ చేశారు. అన్ని శాఖల నుంచి వచ్చిన సమాచారాన్ని ఆన్లైన్లో అనుసంధానం చేశారు. ఆధార్ నెంబర్ జోడిస్తే చాలు భృతికి అర్హులవునా, కాదా? అనే విషయం వెల్లడవుతుందని చెబుతున్నారు. యువనేస్తం పోర్టల్ ఒక ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజిలా పనిచేయనుందని చెబుతున్నారుఇందులో భాగంగా యువనేస్తం వెబ్సైట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పథకం కింద అర్హులకు అక్టోబర్ నుంచి ప్రతినెలా ఆన్లైన్లో భృతి జమ అవుతుందని చెబుతున్నారు. నిరుద్యోగ భృతి అంటే పింఛన్లా ప్రతినెలా అందించేది కాకుండా ఉపాధి కల్పనతో పాటు ఉద్యోగాల్లో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా చేయూతనివ్వటం యువనేస్తం పథకం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం చెబుతోంది.
మరి ఇది ఎంతవరకూ సాధ్యమో తెలియడం లేదు. భృతితో ఆర్థికంగా చేయూతనదిస్తూ నైపుణ్యతలో నిరుద్యోగులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని హామీని ఇస్తున్నారు. ఈ పథకం కింద అర్హులైన ప్రతి యువతకు నెలకు వెయ్యి రూపాయలు చెల్లించనున్నారని తెలుస్తోంది.
ఏదిఏమైనప్పటికీ ఎన్నికల నేపధ్యంలో ఈ పథంకం ఎంతవరకూ సమర్థవంతంగా అమలువుతుందో వేచి చూడాల్సిందే. అయితే ఇటువంటి పథకం ఫెయిలయితే పార్టీపై ప్రభావం పడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Tags:Youth unemployed as Ottley Target